ఎవరు అధ్యక్షులను మార్చినా ప్రజల మనస్సు మార్చలేరు – హరీష్ రావు

-

భోపాల్ లో సీఎం కేసీఆర్ పై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్ రావు. బిఆర్ఎస్ ఎవరికి ఏజెంట్ కాదని.. రైతులకు, ప్రజలకు మాత్రమే ఏజెంట్ అని అన్నారు. ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా మళ్ళీ కేసీఆర్ నే ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. బిఆర్ఎస్ బలపడుతుందన్న భయంతోనే మోదీ వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారని వండిపడ్డారు. మహారాష్ట్ర సభకు విశేష స్పందన వచ్చిందని.. అదానీ బలపడాలంటే మోడీని గెలిపించాలంటూ సెటైర్లు వేశారు.

తాము వద్దు అనుకున్న వాళ్లు పార్టీ మారారని.. వాళ్లతో ఎలాంటి ఉపయోగం ఉండదని అన్నారు. ఇక ఎవరు అధ్యక్షులను మార్చినా..? ఎవరు మంత్రులను మార్చినా..? ప్రజల మనసును మార్చలేరని.. ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా కేసీఆర్ ముందు అవేవీ చెల్లవన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news