రవిప్రకాష్ కేసులో పోలీస్ లపై హైకోర్ట్ సీరియస్..

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌పై నమోదైన ఫేక్‌ ఐడీ కార్డు కేసుపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఈ నేప‌థ్యంలో రవిప్రకాష్ విషయంలో లాయర్స్, పోలీస్‌ల‌పై హై కోర్ట్ సీరియస్ అయింది. ఒక మనిషిని ఎంతలా హింస పెడుతారని ప్రశ్నించింది. రవిప్రకాష్‌ను జీవితాంతం జైల్లో పెడుతారా? అని హైకోర్టు నిలదీసింది.

పోలీసులు న్యాయవ్యవస్థను దుర్వినియోగం చేస్తే.. కోర్టుకు పిలిపించాల్సి వస్తుందని హైకోర్టు హెచ్చరించింది. రవిప్రకాప్‌పై నమోదైన కేసులు వివరాలను.. మంగళవారంలోగా ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.