హైదరాబాద్ గాజులరామారం లో ఉద్రిక్తత.. టెన్షన్ టెన్షన్ !

హైదరాబాద్ లోని గాజులరామారం లో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి కూన శ్రీనివాస్ గౌడ్ ను స్క్రూటిని లో కుట్రపూరితంగా డిస్ క్వాలిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీంతో రిటర్నింగ్ ఆఫీస్ వద్ద అభ్యర్థి కూన శ్రీనివాస్ గౌడ్ అన్న, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆందోళనకు దిగారు. రిటర్నింగ్ ఆఫీస్ కి ఎంపీ రేవంత్ రెడ్డి కూడా బయలుదేరినట్టు చెబుతున్నారు.

అభ్యర్థి అడ్వకేట్ ను కూడా అధికారులు అనుమతించడం లేదంటూ కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. టీఆర్ఎస్ ఒత్తిళ్లకు అధికారులు లొంగుతున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇక అక్కడ ఆందోళనకు దిగిన ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. లాఠీఛార్జి కూడా చేసినట్లు కొందరు చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే అందాల్సి ఉంది. రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకుంటే పరిస్థితి చేయి దాటే అవకాశం కనిపిస్తోంది.