తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాసేపటి క్రితమే…. పీసీసీ చీఫ్ ఇంటి ముట్టడికి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రయత్నించారు. అయితే…. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు…. వెంటనే అక్కడి కి చేరుకున్నారు.
రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టిడి చేయడానికి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. ఈ నేపథ్యం లోనే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మరియు పోలీసులు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పై రేవంత్ రెడ్డి నిన్న… చేసిన వ్యాఖ్యలకు నిరసన గా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆందోళన కు దిగారు.