సుప్రీం కోర్ట్కు చేరిన ‘హిజాబ్’ వివాదం… కర్ణాటక హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వుల ఛాలెంజ్

-

కర్ణాటకలో ‘ హిజాబ్’ వివాదం సుప్రిం కోర్ట్ కు చేరింది. హిజాబ్ వివాదంపై దాఖలైన అన్ని పిటిషన్లను నిన్న కర్ణాటక హైకోర్ట్. ఈ వివాదంపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తుది తీర్పు వచ్చే వరకు ఎలాంటి మతపరమైన దుస్తులు ధరించవద్దని… యూనిఫాం లోనే తరగతులకు హాజరుకావాలని తీర్పు ఇచ్చింది. సోమవారం నుంచి స్కూళ్లు, కాలేజీలు తెరవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. నిన్న ఈ వివాదాన్ని విచారించిన కర్ణాటక త్రిసభ్య ధర్మాసనం ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

తాజాగా ఈ వివాదం సుప్రీం కోర్ట్కు చేరింది. కర్ణాటక హైకోర్ట్ ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేయాలని కొంతమంది సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉంటే ఇంతకుముందు సుప్రీం కోర్ట్ కు కేసును బదిలా చేయాలంటూ.. కపిల్ సిబల్ దాఖలు చేసిన పిటిషన్ దాఖలు చేశారు. అయితే కర్ణాటక హైకోర్ట్ లో కేసు నడుస్తుందని ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని.. తుది తీర్పు వచ్చిన తర్వాతే విషయాన్ని పరిశీలిస్తామని వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news