హిమాచల్‌ సీఎం సుఖ్విందర్‌ సింగ్‌ సుఖుకు కరోనా పాజిటివ్‌

-

హిమాచల్‌ప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రి సుఖ్విందర్‌ సింగ్ సుఖు కరోనా బారిన పడ్డారు. రెండు రోజుల నుంచి స్వల్పంగా జ్వరం ఉండటంతో ఆయన కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఇటీవల తనతో సన్నిహితంగా మెలిగిన పార్టీ నేతలు, కార్యకర్తలు, అధికారులు జాగ్రత్తలు పాటించాలని సుఖ్విందర్‌ సూచించారు. లక్షణాలు ఉన్నవాళ్లు వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు.

ఇటీవల జరిగిన హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకుగాను 40 స్థానాల్లో గెలిచింది. దాంతో కాంగ్రెస్‌ అధిష్ఠానం సుఖ్విందర్‌ సింగ్‌ సుఖుకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది. అధికార బీజేపీ 25 స్థానాలకే పరిమితమై ఓటమి చవిచూసింది. ముఖ్యమంత్రి అయిన కొన్ని రోజులకే సుఖ్విందర్‌ కొవిడ్‌ బారిన పడటం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news