ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు గుంటూరు జిల్లా జైలుకు వెళ్లారు. జైలులో నిందితుల గుర్తింపు పరేడ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జైలులో బంధించి తనను కొట్టిన వ్యక్తిని గుర్తించినట్లు తెలిపారు. కొట్టి నా గుండెలపై కూర్చున్నప్పుడు అతని మాస్క్ జారిపోయిందని అన్నారు. తనపై దాడి చేసేందుకు మొత్తం ఐదుగురు వచ్చినట్లు గుర్తించానని చెప్పారు. కోర్టులో తన స్టేట్మెంట్ రికార్డు చేశారని వెల్లడించారు. అంతేకాదు.. తులసిబాబుపై తాను
టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేయలేదని చెప్పారు.
తులసిబాబుకు టీడీపీ సభ్యత్వం లేదని తెలిసిందని అన్నారు. ఇక నుంచి అతన్ని పక్కనపెడతారని అనుకుంటున్నా అని అభిప్రాయపడ్డారు. విచారణ ఆలస్యమైనా నిందితులు దొరుకుతారని అన్నారు.
ఆ కేసులో తనకు తప్పకుండా న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని అన్నారు. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో ప్రైవేటు వ్యక్తి అయిన తులసిబాబును జనవరి 8న పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం గుంటూరు జిల్లా జడ్జి సమక్షంలో తులసిబాబును పోలిన వ్యక్తులతో గుంటూరు జైల్లో పోలీసులు పరేడ్ నిర్వహించారు.