ఈ హైదరాబాద్ జనాలకు భయం లేదా…

-

కరోనా కట్టడి కావాలి అంటే జనాలకు భయం అనేది చాలా అవసరం. ఆ భయం లేకపోతే కరోనా వైరస్ ని కట్టడి చేయడం అనేది చాలా కష్టం. కాని హైదరాబాద్ లో మాత్రం జనాలు మాత్రం మాట వినే పరిస్థితి ఎక్కడా కనపడటం లేదు. ఉప్పల్ నుంచి లింగంపల్లి వరకు రోడ్ల మీదకు వస్తున్నారు.ఎన్ని విధాలుగా చెప్పినా సరే ఎవరూ కూడా అర్ధం చేసుకోవడం లేదు. వాహనాలు సీజ్ చేస్తున్నా సరే ఎవరూ కూడా ఆగడం లేదు.

చికెన్, మతాన్ దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. చేపల మార్కెట్ లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇష్టం వచ్చినట్టు జనం రోడ్ల మీదకు వచ్చి ఇప్పుడు నాన్ వెజ్ కోసం ఎగాబడటమే కాకుండా కనీసం సామాజిక దూరం కూడా పాటించడం లేదు. ఒకరి మీద ఒకరు పడుతున్నారు. మాకు ఇవ్వండి మాకు ఇవ్వండి అంటూ మీద పడిపోతున్నారు. ఒక్కో చికెన్ షాప్ వద్ద 30 నుంచి 60 మంది వరకు ఉంటున్నారు.

హైదరాబాద్ పరిధిలో ఎక్కువగా కరోనా కేసులు ఉన్నాయి. అయినా సరే జనంలో మాత్రం మార్పు రావడం లేదు. దీనిపై అధికారులు చర్యలు తీసుకున్నా సరే జనాలు మాత్రం మారే అవకాశాలు కనపడటం లేదు. ఇక తెలంగాణా సర్కార్ ఈ విషయంలో సీరియస్ అయింది. షాపు దగ్గర సామాజిక దూరం పాటించని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆహేశాలు ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news