ఓటీటీలో ‘హిట్‌2’ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?

-

థ్రిల్లర్ జానర్​లో వచ్చి బ్లాక్​బస్టర్ హిట్ కొట్టిన రీసెంట్ మూవీ హిట్-2. అడివి శేష్‌ కీలక పాత్రలో శైలేష్‌ కొలను తెరకెక్కించిన ఈ క్రైమ్‌ మిస్టరీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. గతంలో వచ్చిన ‘హిట్‌’ చిత్రానికి ఫ్రాంఛైజీగా దీన్ని తెరకెక్కించారు. డిసెంబరు2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘హిట్‌2’ బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఓటీటీలో ఎప్పుడు విడుదలవుతుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో గుడ్ న్యూస్ చెప్పింది.

ప్రస్తుతం అద్దె ప్రాతిపదికన ‘హిట్‌2’ను స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంచింది. రూ.129 చెల్లించి ‘హిట్‌2’ను చూడవచ్చు. తెలుగు ఆడియోతో పాటు, ఇంగ్లిష్‌ సబ్‌టైటిల్స్‌తో ఇది స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇటీవల ఈ చిత్రాన్ని హిందీలోనూ డబ్‌ చేసి విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఎలాంటి అద్దె చెల్లించకుండా ‘హిట్‌2’ ఎప్పుడు అందుబాటులో ఉంటుందనే విషయం మాత్రం అమెజాన్‌ ప్రైమ్‌ తెలుపలేదు. గత చిత్రాల మాదిరిగానే వారం, పదిరోజుల్లో ప్రైమ్‌ చందాదారులు ఎలాంటి అదనపు అద్దె చెల్లించకుండా ఈ సినిమాను చూడవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news