HIT 3 Teaser: లాఠీతో అర్జున్ సర్కార్ వచ్చేశాడు..టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా నాని సరిపోదా శనివారం సినిమాతో బంపర్ విజయాన్ని అందుకున్నాడు. అయితే ఈ సినిమా సక్సెస్ మూడ్ లో ఉన్న నాని… హిట్ 3 సినిమాపై కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా టీజర్ ను వదిలింది చిత్ర బృందం.

అర్జున్ సర్కార్ పేరుతో… ఈ సినిమా లో నాని కనిపించబోతున్నాడు. అయితే విడుదల చేసిన ఈ టీజర్ లో… పోలీస్ గెటప్ లో ఉన్న న్యాచురల్ స్టార్ నాని లాఠీ పట్టుకుని కనిపించాడు. అంతేకాదు… నిందితులను దారుణంగా కొడుతూ తనలోని క్రూరత్వాన్ని నాని చూపించాడు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ సినిమా… బంపర్ హిట్ అవుతుందని అంటున్నారు.