ప్రతి 2 నిమిషాలకు హెచ్ఐవీ బారిన పడుతున్న ఒక చిన్నారి… యూనిసెఫ్ నివేదికలో వెల్లడి..

-

కరోనా పాండమిక్ తీవ్రం కావడంతో 2020లో హెచ్ఐవీ నివారణ చర్యలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. వరసగా లాక్ డౌన్ లు విధించడం ఇందుకు కారణంగా ఉందని యూనిసెఫ్ ఓ నివేదికలో వెల్లడించింది. 2020లో కనీసం 3,00,000 మంది పిల్లలు, దాదాపుగా ప్రతి రెండు నిమిషాలకు ఒక బిడ్డ కొత్తగా HIV బారిన పడ్డారని UNICEF ఒక కొత్త నివేదిక పేర్కొంది. డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఈ నివేదిక ప్రచురించబడింది. అదే సమయంలో ఎయిడ్స్ వల్ల, దాని సంబంధిత కారణాల వల్ల 1,20,000 మంది పిల్లలు లేదా ప్రతి ఐదు నిమిషాలకు ఒక బిడ్డ మరణించారని కూడా పేర్కొంది.

కోవిడ్ కారణంగా ఎక్కువ అవుతున్న హెచ్ఐవీ ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రయత్నం చేయకపోతే.. ఎయిడ్స్ బారిని పడిన పిల్లలు మరణించే అవకాశం ఎక్కువగా ఉందని యూనిసెఫ్ అభిప్రాయపడింది. 2020లో కరోనా పాండమిక్ హెచ్ఐవీ చికిత్సపై తీవ్ర ప్రభావాన్ని చూపిందని.. ఎక్కువ ప్రభావిత దేశాల్లో పిల్లలకు హెచ్ఐవీ పరీక్షలు 50 నుంచి 70 శాతం తగ్గాయని తెలిపింది. అనేక దేశాల్లో ప్రసూతి హెచ్‌ఐవి పరీక్షలు , యాంటీరెట్రోవైరల్ హెచ్‌ఐవి చికిత్స ప్రారంభించడంలో కూడా గణనీయమైన తగ్గింపులను అనుభవించాయని నివేదిక తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news