బియ్యానికి పురుగులు పట్టకుండా ఈ చిట్కాలు ట్రై చేయండి..!

-

మనం ఇంట్లో సరుకులు నెలకోసారి తీసుకొస్తూ ఉంటాం. కానీ బియ్యం మాత్రం కొందరు ఆరు నెలలు, మరికొందరు సంవత్సరానికి సరిపడా ఒకసారే కొంటారు. ఇక వరి పండించే వాళ్లైతే సంవత్సరాలకు సరిపడా బియ్యాన్ని నిల్వ చేసుకుంటారు. అయితే కొన్నిసార్లు నిల్వ చేసిన బియ్యం పురుగులు పడుతుంటాయి. ఆ పురుగులు పడిన బియ్యం తినలేక కొందరు పారవేస్తారు. కానీ అందరికీ ఆ స్తోమత ఉండదు. మరికొందరు బోరిక్ యాసిడ్ వంటివి కలుపుతూ బియ్యంలో పురుగులు పట్టకుండా జాగ్రత్త పడుతుంటారు. ఇదే కాకుండా బియ్యం నిల్వ చేయడానికి మరికొన్ని చిట్కాలు ఉన్నాయి. ఈ టిప్స్ ట్రై చేయండి. మీ బియ్యాన్ని పురుగుల బారి నుంచి కాపాడుకోండి.

వర్షాకాలంలో బియ్యానికి ఎక్కువగా పురుగులు పడతాయి. పురుగులు పట్టిన బియ్యంతో చేసిన అన్నం తింటే జీర్ణసంబంధిత సమస్యలొస్తాయి. అందుకే బియ్యం పురుగుల బారిన పడకుండా ఉండటానికి ఈ ఈజీ టిప్స్ పాటించి చూడండి..

చాలా మంది మార్కెట్ లో లభించే కెమికల్ పౌడర్లు వాడుతుంటారు. కానీ ఈ కెమికల్స్ బియ్యంలో కలపడం వల్ల పురుగు పట్టకుండా చేసినా.. దీర్ఘకాలంలో ఆ బియ్యంతో చేసిన అన్నం తిన్న వారికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశముందని డాక్టర్లు చెబుతున్నారు. ఎలాంటి కెమికల్స్ ఉపయోగించకుండా హోం రెమిడీస్ తోనే బియ్యాన్ని పురుగుల బారి నుంచి కాపాడుకునే వీలుంది. అదెలాగంటే..?

బిర్యానీ ఆకు.. మీకు బిర్యానీ ఆకు తెలుసుగా. అదేనంటి బే లీఫ్ అంటారు. ఈ ఆకును కేవలం బగారా రైస్ చేయడానికో, బిర్యానీ కోసమే కాదు. అవి చేయడానికి ముఖ్యంగా అవసరమైన బియ్యాన్ని పురుగులు పట్టకుండా కూడా ఉంచుతుంది. బియ్యం నిల్వ చేసే డబ్బాల్లో ఈ బిర్యానీ ఆకులను ఉంచండి. గాలి చొరబడని కంటైనర్ లోనే బియ్యాన్ని నిల్వచేయండి. ఇలా చేస్తే పురుగులు పట్టవు.

లవంగాలు.. ఘాటు అనే పదం వినగానే మనకు గుర్తొచ్చేది ఏంటి. లవంగాలు.. మాంచి మసాలా కర్రీ తినాలనుకుంటే అందులో లవంగాలు తప్పక ఉండాల్సిందే. ఈ లవంగాలు మనకు మంచి స్పైసీ ఫీల్ ని ఇవ్వడానికే కాకుండా బియ్యంలో పురుగులు పట్టకుండా చూస్తాయి. బేసిక్ గా లవంగాలకు కీటకాలతో పోరాడే గుణం ఉంటుందట. అందుకే బియ్యం నిల్వ ఉంచిన డబ్బాలో గనుక ఓ పది లవంగాలను ఓ వస్త్రంలో చుట్టి ఉంచితే బియ్యం పురుగు రాకుండా ఉంటుంది.

కర్రీ మాంచీ ఫ్లేవర్ రావాలంటే అందులో వెల్లుల్లి తప్పక ఉండాల్సిందే. ఈ రెసిపీకి టేస్ట్ ని అందించడానికే కాదు.. ఆరోగ్యానికీ చాలా మంచిది. అంతేకాకుండా వెల్లుల్లుని పొట్టు తీసి బియ్యంలో ఉంచితే పురుగు రాకుండా ఉంటుంది.

కర్పూరం.. కాస్త కర్పూరాన్ని ఓ చిన్న వస్త్రంలో చుట్టి నిల్వ ఉంచిన బియ్యంలో పెడితే పురుగులు రాకుండా ఉంటుందట.

వేపాకు.. వేపాకులో ఔషధ గుణాలుంటాయని మనకు తెలుసు. కానీ ఇది బియ్యం పురుగు పట్టకుండా చేయడంలో అద్భుతంగా పనిచేస్తుందని మీకు తెలుసా. బియ్యం నిల్వ ఉంచే డబ్బా అడుగున వేపాకును ఉంచాలి. తర్వాత దానిపై బియ్యం పోయాలి. ఇలా కాకుండా వేపాకుల పొడిని ఓ వస్త్రంలో చుట్టి బియ్యం నిల్వఉంచిన డబ్బాలో పెట్టినా ఫలితం ఉంటుంది. సో.. ఈసారి బియ్యంలో పురుగులు కనిపిస్తే వాటిని పారేయకుండా ఈ చిట్కాలు పాటించి చూడండి.

Read more RELATED
Recommended to you

Latest news