బాడీ షేమింగ్ పై స్పందించిన హనీరోజ్..!

-

వీర సింహారెడ్డి సినిమాతో తెలుగులో ఒక్కసారిగా క్రేజీ సంపాదించుకుంది మలయాళీ బ్యూటీ హనీ రోజ్.. ఈ మూవీతో ఫాలోయింగ్ కూడా బాగా పెరిగిపోయింది. హనీ రోజ్ అందాలకు నటనకు ఫిదా అవ్వని ప్రియులు లేదంటే సందేహం లేదు. సోషల్ మీడియాలో భారీ పాపులారిటీ దక్కించుకున్న హీరోయిన్లలో హనీ రోజ్ కూడా ఒకరు. ఇటీవల ఈ ముద్దుగుమ్మ చేస్తున్న రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కొన్నిసార్లు హనీ డ్రెస్సింగ్ పై విమర్శలు ఎదుర్కొంటుంది.

ఇటీవల ఒక షోరూం ఓపెనింగ్ లో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ బాడీ షేమింగ్ కామెంట్స్ పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రజలు నటీనటుల పై ప్రతికూల విషయాలు ఎందుకు చెబుతారు అనేది తెలిసి ఆశ్చర్యపోయినట్లు తెలిపింది. కొన్నిసార్లు సోషల్ మీడియా కూడా ప్రతికూలంగా మారుతుందని ఆమె ఆరోపించింది.. ఎలాంటి దుస్తులు ధరించాలి? ఏ విధంగా రెడీ కావాలి అనేది తన ఇష్టానుసారంగా ఉంటుందని తెలిపింది హనీ రోజ్.

అలాగే సినిమాలలో పాత్రకు తగినట్లుగా తన డ్రెస్సింగ్ ఉంటుందని తనకు చీర అంటే ఇష్టమని కానీ అందులో నడవడమే కాస్త కష్టమని తెలిపింది ఇకపోతే ఈ అడ్రస్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎక్కువగా చీరకట్టులోనే ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటుంది బరువు పెరిగిన తగ్గిన ప్రజలు నిత్యం ఎగతాళి చేస్తుంటారని ప్రతి స్త్రీ ఇలాంటి మాటలు వింటూనే ఉంటుందని తెలిపింది. హీరోయిన్స్ పై వచ్చే నెగటివ్ కామెంట్స్ ట్రోల్స్ సినిమాలపై ప్రభావం చూపిస్తాయని అందుకే ప్రతి చిత్రాన్ని జాగ్రత్తగా ఎంచుకున్నట్లు తెలిపింది ఇకపోతే బాడీ షేవింగ్ పై ఈ ముద్దుగుమ్మ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు డ్రెస్సింగ్ స్టైల్ లో తనకు నచ్చినట్టుగా ఉంటానని చెప్పకనే చెప్పేసింది.

Read more RELATED
Recommended to you

Latest news