సముద్ర తీరంలో భయంకరమైన జీవి..ఫోటోలు వైరల్..

-

ప్రకృతిలో ఎన్నో అద్బుతాలు ఉంటాయి.. ఒకదాని గురించి తెలుసుకునే లోపు మరొకటి వింతగా మారుతుంది. అయితే ఈ మధ్య కాలంలో ఎన్నో వింత జీవులు గురించి తెలుసుకుంటున్నాము.. ఇప్పటికే కొత్త జీవుల గురించి తెలుసుకున్నాము.అయినా ప్రకృతి అతి పెద్ద ప్రపంచం..ఆసక్తితో ముందుకు సాగితే ప్రకృతి ప్రతిరోజూ మరింత కొత్త సమాచారంతో మనల్ని ఆశ్చర్యపరుస్తుంది.

అది మొక్కలు కావచ్చు, జీవులు కావచ్చు. ఎన్ని రకాల మొక్కలు, మనకు తెలియని జీవులు మనలాగే ప్రకృతితో మైమేకమై జీవిస్తున్నాయో చెప్పలేం. అలాంటిదే ఇక్కడో అరుదైన జీవి సముద్రం ఒడ్డున కనిపించింది. అది మీ దృష్టికి చాలా భిన్నమైన చిత్రాన్ని చూపిస్తుంది. అది మీకు మొదటి చూపులో అర్థం చేసుకోలేని రూపం.. ఆకుపచ్చగా మధ్యలో కన్పిస్తుంది.బంగారు రంగును కలిగి ఉంటుంది. కానీ, ఈ వింత దృశ్యం ఏమిటో చెప్పటం మాత్రం సాధ్యం కావడం లేదు..

విషయాన్నికొస్తే.. ఎడిన్‌బర్గ్‌లోని పోర్టోబెల్లో బీచ్‌లో మైక్ ఆర్నాట్ అనే యువకుడు నడుచుకుంటూ వెళుతుండగా దీన్ని కనుగొన్నాడు. మొదట మైక్ నాచు, మట్టితో కప్పబడిన పైన్ కోన్ అని భావించాడు. కానీ, దగ్గరికి వచ్చేసరికి అది సజీవంగా ఉందని, అది జీవి అని గ్రహించాడు. ఎంత గమనించినా ఈ జీవి ఏమిటో అతనికి అర్థం కాలేదట. ఒకానొక సమయంలో తాను ఏలియన్ అనుకుని ఆశ్చర్యపోయానంటూ మైక్ చెప్పాడు.అందుకు సంబందించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సముద్రంలో కనిపించే ప్రత్యేక రకం పురుగు. దీనిని స్కాటిష్ వైల్డ్‌లైఫ్ ట్రస్ట్‌లో పనిచేస్తున్న పీట్ హాస్కెల్ కనుగొని స్పష్టం చేశారు. యూకే ఒడ్డున కూడా ఇలాంటివి చూడొచ్చని అంటున్నారు. అయితే నీటిలో ఎక్కువగా కనిపించే ఈ పురుగు నీళ్ల నుంచి బయటకు రాగానే అందరు వింతగా చూస్తున్నారు.ఏది ఏమైనా ఈ జీవి ఫోటోలు నెట్టింట ఆకర్షిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version