తెలంగాణ కరోనా బులెటిన్.. కేసులు.. మరణాలు.

తెలంగాణలో కరోనా విలయతాండవం బాగా తగ్గింది. దేశమంతా కూడా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన 24గంటల్లో తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 1933గా ఉంది. మొత్తం మరణాలు 16. నిన్న ఒక్కరోజే కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 3525మంది. రికవరీ రేటు 95.14గా ఉంది. ఇక మొత్తం తెలంగాణలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 25,406గా ఉంది. ప్రస్తుతం తెలంగాణలో లాక్డౌన్ కొనసాగుతుంది. ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1గంట వరకు లాక్డౌన్ సడలింపులు వరిస్తున్నాయి.

ఈ రోజు లాక్డౌన్ పొడిగింపుపై కేబినేట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం రెండు గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. మాస్ వ్యాక్సినేషన్ సహా లాక్డౌన్ పొడిగింపు నిర్ణయం, రైతు బంధు అంశాలు, వర్షాలు ఇరిగేషన్, పీఆర్సీ, ఔట్ సోర్సింగ్ జీతాల విషయంలో ఈ సమావేశంలో చర్చించనున్నారు. కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో లాక్డౌన్ పొడిగించరని అంచనా వేస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.