చైనా లో కూలిన హోటల్…శిధిలాల కింద చిక్కుకున్న కరోనా బాధితులు

-

కరోనా వైరస్ తో సతమతమౌతున్న చైనా లో మరో భారీ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది. కరోనా తో అల్లాడుతున్న ఆ దేశం దానిని అరికట్టడం కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న చైనా లో ఇప్పుడు ఈ ప్రమాదం రూపంలో మరింత దెబ్బ పడింది. అక్కడ రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో చైనా ఫుజియాన్ ప్రావిన్స్ లోని క్వాంజౌ నగరంలో ఉన్న ఒక హోటల్ ను ఏర్పాటు చేసింది. ఆ హోటల్ లో కరోనా బాధితులను ఉంచి వారికి కావాల్సిన వైద్య సదుపాయాలను ఆడిస్తుంది. అయితే ఆ హోటల్ గతరాత్రి 7:30 గంటల సమయంలో కుప్పకూలినట్లు తెలుస్తుంది. దీనితో దాదాపు70 మందికి పైగా కరోనా బాధితులు శిధిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తుంది. అయితే సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది హుటాహుటిన అక్కడకి చేరుకొని సహాయక చర్యలు చేపట్టగా ఇప్పటివరకు 35 మందిని బయటకు తీసినట్లు అధికారులు చెబుతున్నారు. చైనా లో రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ హోటల్ లో మొత్తం 80 రూమ్ లు ఉండగా,కరోనా నేపథ్యంలో బాధితుల కోసం అధికారులు ఈ హోటల్ నే ఉపయోగిస్తున్నారు.

అయితే భవనం కూలినట్లు తెలిపిన అధికారులు అసలు  భవనం ఎందుకు కూలింది,కారణం ఏంటి అన్నది మాత్రం వెల్లడించలేదు. ఇటీవల చైనా లో మొట్ట మొదటి సారిగా ఈ కరోనా వైరస్ అనేది వ్యాప్తి చెందిన సంగతి తెలిసిందే. ఈ కరోనా మహమ్మారి చైనా లో విలయతాండవం చేయడం తో 2 వేలకు పైగానే మృతి చెందారు.

Read more RELATED
Recommended to you

Latest news