గత ఐదేళ్లలో సీఎం జగన్ ఎవరినైనా కలిశారా? అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు.బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరులో టీడీపీ ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడుతూ…’కరవు, తుపాన్ల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. తుపాన్ల కంటే అసమర్థ ముఖ్యమంత్రి వల్ల ఎక్కువ నష్టపోయారు అని మండిపడ్డారు. రాష్ట్రంలో ధాన్యం కొనే దిక్కు లేదు. తుపాను వల్ల నష్టపోతే పరామర్శించేందుకు ముఖ్యమంత్రి రాలేదు. ఇప్పుడు రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారు’ అని చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు.
రాజధాని విషయంలో జగన్ 3 ముక్కలాట ఆడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు’అమరావతి పూర్తైతే ఇక్కడే అందరికీ ఉపాధి దొరికేది. ఉపాధి కోసం యువత హైదరాబాద్ , బెంగళూరు, చెన్నై వెళ్తున్నారు. ఓటు వేసిన వారినే కాటు వేసే రకం జగన్ అని విమర్శించారు. నా SCలు అంటూ వారి నెత్తిమీదే చెయ్యి పెడతారు.నాసిరకం మద్యంతో అనేక మంది చనిపోతున్నారు అని అన్నారు5 ఏళ్లలో పోలవరం ఎంత పూర్తైంది? రోడ్లపై గుంతలు పూడ్చలేని వారు మూడు రాజధానులు ఎలా కడతారు?’ అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.