మీకు పరిచయం లేని నెంబర్స్ నుంచి కాల్స్ ఎక్కువగా వస్తున్నాయా..పదే పదే వస్తుంటే విసిగి వేసారి పోతున్నారా? కంగారు పడాల్సిన అవసరం లేదు..ఆ నెంబర్ ఎవరిదో తెలుసుకోనే వెసులుబాటును కల్పించబొతుంది టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా..వచ్చే ఈ మార్పు వలన కాల్ లిఫ్ట్ చేసేటప్పుడు కాలర్ పేరు డిస్ప్లే మీద కనిపించేలా మార్పులు తీసుకొస్తోంది. గుర్తుతెలియని కాల్స్ వలన అనేకమంది వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని ట్రాయ్ దృష్టికి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇకపై ఎవరు, ఎవరికి కాల్ చేసినా, వారికి పేరు కనిపించేలా చర్యలు తీసుకోనున్నట్లు తాజాగా ప్రకటించింది.
టెలికాం ఆపరేటర్ల దగ్గర అందుబాటులో ఉన్న వినియోగదారుల కస్టమర్ KYC రికార్డ్ను బట్టి కాల్ చేసిన వారి పేరు ఈజీగా డిస్ ప్లే అవుతుందని వెల్లడించింది. ఇకపోతే ట్రాయ్ తీసుకునే ఈ నిర్ణయం వలన అనేకమందికి మేలు చేకూరనుంది. ప్రస్తుతం వినియోగదారులు తెలియని కాలర్ గుర్తింపును కనుగొనేందుకు ట్రూ కాలర్ లాంటి థర్డ్ పార్టీ యాప్ లను వాడుతున్నారు. డేటా క్రౌడ్ సోర్స్ గా ఉన్నందున Truecaller లాంటి యాప్ లకు చాలా వరకు పరిమితులు అనేవి వుంటాయి. ఈ నేపథ్యంలో కచ్చితమైన ప్రామాణికత ఉండదు. కానీ, ట్రాయ్ తీసుకునే కేవైసీ డేటా ఆధారంగా డిస్ ప్లే అయ్యే పేరు వందకు వంద శాతం ఖచ్చితంగా ఉంటుంది.
ఎందుకంటే, ఈ KYC డేటా, సర్వీస్ ప్రొవైడర్లు అధికారికంగా ఇస్తారు..ఇక ఫేక్ విషయాలు అనేవి దాదాపుగా ఇందులో వుండవు. దీని కారణంగా కాలర్ కు సంబందించి ఖచ్చితమైన గుర్తింపు ఉంటుంది. ఈ చర్యల వలన Spam కాల్స్ ను తేలికగా నివారించే అవకాశం ఉంటుంది. అలాగే థ్రెటెనింగ్ కాల్స్ నుంచి రక్షణ పొందే అవకాశం కలదు. ముఖ్యంగా అమ్మాయిలు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని TRAI సూచించింది. అయితే త్వరలో ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది..ఇక మీరు ఫ్రీ అవ్వండి..మీ స్నేహితులతో ఈ విషయం గురించి చర్చించండి..