శివసేన, థాక్రేల పేర్లు వాడకుండా వారెంత దూరం వెళ్లగలరు?: ఉద్దవ్ థాక్రే

-

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం మరింతగా ముదురుతోంది.తిరుగుబాటు చేసే ఎక్నాథ్ షిండే వెనుక చేరిన ఎమ్మెల్యేలపై శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే మండిపడ్డారు.పార్టీ నేతలతో శుక్రవారం నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.” వారు పార్టీని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు.పార్టీ కోసం ప్రాణాలిస్తామని ప్రమాణాలు చేసిన వారే ఇప్పుడు పారిపోయి పార్టీని దెబ్బతీస్తున్నారు. శివసేన,థాక్రేల పేర్లు వాడకుండా వారు ఎంత దూరం వెళ్ళగలరు?” అని ప్రశ్నించారు.

ఏక్నాథ్ షిండే, ఇతర ఎమ్మెల్యేలు తమ తిరుగుబాటుకు కారణాల్లో ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రేను కారణంగా చూపుతుండటం, ఆదిత్య ఠాక్రే మరో అధికార కేంద్రంగా మారాడని ఆరోపిస్తూండడంపై ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు.ఏక్నాథ్ షిండే కుమారుడు ఎంపీగా ఉన్నారు.అలాంటప్పుడు నా కుమారుడి విషయంలో వారికి ఉన్న సమస్య ఏమిటో అర్థం కావడం లేదు.నేను ఇక కోలుకోలేనని కొందరు భావిస్తున్నారు.ఇలాంటి వాటిని నేను పట్టించుకోను.” అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news