వినాయక చవితి రోజున భక్తులందరూ తమ తమ ఇండ్లలో వినాయకుడి విగ్రహాలను పెట్టుకుని పూజలు చేస్తారు. ఈ క్రమంలోనే కొందరు వినాయకుడి విగ్రహాలను త్వరగా తీసేసి నిమజ్జనం చేస్తారు.
వినాయక చవితి రోజున భక్తులందరూ తమ తమ ఇండ్లలో వినాయకుడి విగ్రహాలను పెట్టుకుని పూజలు చేస్తారు. ఇక బహిరంగ ప్రదేశాలలోనూ అనేక చోట్ల విగ్రహాలను పెట్టి పూజలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే కొందరు వినాయకుడి విగ్రహాలను త్వరగా తీసేసి నిమజ్జనం చేస్తారు. ఇంకొందరు చాలా ఆలస్యంగా విగ్రహాలను నిమజ్జనం చేస్తుంటారు. అయితే అసలు వినాయకుడి విగ్రహాలను ఎవరైనా సరే.. ఎన్ని రోజుల పాటు ఉంచుకోవచ్చు, ఎన్ని రోజుల తరువాత విగ్రహాలను తీసేయాలి..? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా ఇల్లు లేదా బయట ఎక్కడ వినాయకుడి విగ్రహం పెట్టి పూజలు చేసినా సరే.. నిర్దిష్టమైనన్ని రోజులపాటు ఆ విగ్రహాలను ఉంచి పూజలు చేయాలి. ఎప్పుడు పడితే అప్పుడు విగ్రహాలను తీయరాదు. విగ్రహాన్ని పెట్టాక భక్తులు ఒకటిన్నర రోజు, 3 రోజులు, 5, 7, 10 లేదా 11 రోజుల పాటు విగ్రహాలను ఉంచవచ్చు. ఆ తరువాత వాటిని తీసి నిమజ్జనం చేయవచ్చు.
పైన చెప్పిన విధంగా భక్తులు ఎన్ని రోజుల పాటు అయినా వినాయకుడి విగ్రహాలను ఉంచి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకోవచ్చు. పూజలు చేయవచ్చు. అయితే రోజుల సంఖ్యను మాత్రం కచ్చితంగా పాటించాలి. సాధారణంగా చాలా మంది 10 రోజులకు విగ్రహాలను ఊరేగించి నిమజ్జనం చేస్తారు. కానీ కొందరు 3, 5 రోజుల పాటు ఉంచి తీసేస్తారు. అయితే ఎన్ని రోజుల పాటు ఉంచినా.. పైన చెప్పిన నియమాన్ని మాత్రం కచ్చితంగా పాటించాల్సిందే..!