అమెరికాలో ఎంత మంది ఉద్యోగం కోల్పోయారంటే…!

-

కరోనా మహమ్మారి దెబ్బకు అమెరికా అల్లాడిపోయే పరిస్థితి నెలకొంది. ప్రపంచ దేశాలకు పెద్దన్న లాంటి అమెరికా ఇప్పుడు కరోనా వైరస్ ని ఎదుర్కొనే విషయ౦లో ఘోరంగా విఫలం కావడం గమనార్హం. కరోనా వైరస్ ని ఏ విధంగా ఎదుర్కోవాలో అమెరికాకు అర్ధం కావడం లేదు.ఇదిలా ఉంటే ఇప్పుడు అమెరికాలో కోట్ల మంది కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోతున్నారు. అక్కడి కంపెనీలు అన్నీ కూడా ఇప్పుడు ఉద్యోగులను తప్పిస్తున్నాయి.

కరోనా మహమ్మారి కారణంగా అమెరికా వ్యాప్తంగా 25 శాతం మంది ఉద్యోగాలు కోల్పోవడం లేదా జీతంలో కోతను ఎదుర్కొంటున్నారు అని తాజా సర్వే ఒకటి వెల్లడించింది. అమెరికా ఎకనామిక్ సర్వేలో ఈ విషయాన్ని వెల్లడించింది. దీనిలో దేశ వ్యాప్తంగా 800 మంది పాల్గొన్నారు. వీరిలో పది శాతం మంది ఉద్యోగాలు కోల్పోయినట్టు సర్వేకి వివరించారు. ఇక 16 మంది తమకు సగం జీతం వచ్చినట్టు వివరించారు.

8 శాతం మంది రానున్న రోజుల్లో తమ జీతంలో కంపెనీ కోత విధించే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. 1 శాతం మంది ఉద్యోగం పోయే అవకాశం ఉందనే విషయాన్ని చెప్పారు. అయితే చాలా మంది అమెరికా ఆర్ధిక రంగం పూర్తిగా పుంజుకుని పరిస్థితి మెరుగు పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పుడు ఉన్న ఆర్ధిక వ్యవస్థ బాగానే ఉందని వచ్చే ఇబ్బంది ఏమీ లేదని చాలా మంది పేర్కొనడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news