మన’లోకం’ స్పెషల్ : క్రీస్తు పూర్వం – క్రీస్తు శకం లాగా కరోనా పూర్వం – కరోనా శకం !

-

చరిత్ర గురించి ఎవరైనా చెప్పాలి అంటే కచ్చితంగా క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని చరిత్రకారులు ప్రస్తావిస్తుంటారు. అంతగా మనిషి జీవితాన్ని ప్రభావితం చేయడంతో క్రీస్తు చరిత్రలో నిలిచిపోయారు. అయితే ఇప్పుడు తాజాగా ఉన్న ప్రపంచాన్ని భవిష్యత్తులో వివరించాలంటే కరోనా వైరస్ రాకముందు కరోనా వైరస్ వచ్చిన తర్వాత అనగా… ‘కరోనా శకం’ వివరించే పరిస్థితి ప్రస్తుతం దాపురించింది అని చాలామంది అంటున్నారు. ప్రపంచ మారిపోయే చాన్స్ ఉందని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. ఒక చిన్నపాటి వైరస్ ప్రపంచ ఆర్థిక పరిస్థితి నే కాదు మనిషి జీవన విధానాన్ని క్షణాల్లో మార్చేసిందని రాబోయే ప్రపంచం నిన్న మొన్నటి లాగా ఖచ్చితంగా ఉండదని అంటున్నారు.End of the world: Coronavirus is tip of the iceberg - Bible ... ముఖ్యంగా షాపింగ్ మాల్స్ అదేవిధంగా సినిమా థియేటర్లు ఇతర ఎంటర్టైన్మెంట్ కేంద్రాలు భవిష్యత్తులో ఎలా రాణిస్తారు అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా చాలా వైరస్ లు వచ్చినా కానీ కరోనా వైరస్ మాత్రం ప్రపంచాన్ని రోడ్డు మీదకు రాకుండా చేసిందని అంటున్నారు. కనీసం ఇంటిలో ఉన్న మనుషులు ఒకరితో ఒకరు చెయ్యి పట్టుకుని ఆప్యాయంగా మాట్లాడే పరిస్థితిని దూరం చేసిందని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు.

 

రాబోయే రోజుల్లో శుభకార్యాలు గాని పెళ్లిళ్లు గాని జరిగే పరిస్థితి లేకుండా కరోనా వైరస్ చేసిందని… రాబోయే ప్రపంచం కరోనా వైరస్ పూర్వం…కరోనా వైరస్ శకం అన్నట్టుగా మారే అవకాశం ఉందని అంతర్జాతీయ స్థాయిలో చాలామంది అంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే టెక్నాలజీ వచ్చి పక్కన ఉన్న మనిషి తో మాట్లాడే పరిస్థితి లేకుండా చేస్తే… కరోనా వైరస్ వచ్చి పక్కనున్న మనిషినే కాదు ఇంటిలో ఉన్న మనిషిని కూడా టచ్ చేయకుండా దూరం చేసిందని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news