అమ్మ అంజ‌లీ.. కొత్త పార్ట‌న‌ర్‌తో బాగానే ఎంజాయ్ చేస్తున్నావ్‌గా..!!

-

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్న తెలుగు భామ అంజలి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవస‌రం లేదు. ఈ చిత్రంతో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుంద‌ని అంద‌రూ భావించారు. కానీ అందుకు భిన్నంగా అంజలికి వచ్చిన ఏ అవకాశము సరైన విజయం అందుకోలేదు. అలాగే తమిళ ఇండ‌స్ట్రీలోనూ త‌న అదృష్టాన్ని ప‌రిక్షించుకుంది ఈ బ్యూటి. కాని, అక్క‌డా అదే ప‌రిస్థితి. ఈ క్ర‌మంలోనే అంజలి తన జర్నీ కో స్టార్ జై తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతుందని వీరిద్దరూ లైవ్-ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారని వార్తలు మనం వింటూనే ఉన్నాం.

అనుష్కతో కలిసి నిశ్శబ్దంలో

అలాగే ప్ర‌స్తుతం వీరిద్ద‌రూ బ్రేక‌ప్ చేసుకున్నార‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. ప్ర‌స్తుతం లాక్‌డౌన్ కార‌ణంగా అంజ‌లీ ఇంటికే ప‌రిమితం అయింది. అయితే క్వారంటైన్ పిరియడ్‌లో తన కొత్త పార్ట్‌నర్‌తో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను తన ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేసింది అంజ‌లి. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. ఆగండి.. ఆగండి.. పార్ట‌న‌ర్ అంటే అబ్బాయి కాదండోయ్.. కుక్క పిల్ల‌. లాక్‌డౌన్ కాలంలో తన పెంపుడు కుక్క పోలోతో ఆడుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తుంది.

నా క్వాలిటీ సమయాన్ని ఇలా..

ఈ క్ర‌మంలోనే కుక్క పిల్ల‌తో దిగిన ఫోటోలు అంజ‌లి అభిమానుల కోసం పోస్ట్ చేసింది. అంతేకాదు.. క్వాలిటీ టైమ్ విత్ పోలో అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. ఇతనే నా క్వారంటైన్ పార్ట్‌నర్. కరోనా సమయంలో ఫస్ట్ టైమ్ పోలో ఇన్స్‌టాలోకి వచ్చింది అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇంట్లో నేను పోలో తప్ప మరొకరు మా మధ్య రావడం లేదు. ఒంటరి సమయంలో బోర్‌డమ్‌ను ఇలా బ్రేక్ చేస్తున్నాను అని అంజలి పేర్కొన్నది. అలాగే ప్రతీ ఒక్కరు ఇంటి పట్టునే ఉంటూ కరోనాపై పోరాటం చేయండి అంటూ సందేశాన్ని ఇచ్చారు. ఏదేమైనా అంజ‌లి మాత్రం త‌న కొత్త పార్ట‌న‌ర్‌తో బాగానే ఎంజాయ్ చేస్తుంది.

క్వారంటైన్ పార్ట్‌నర్‌తో

Read more RELATED
Recommended to you

Latest news