పాండవులకు ద్రౌపది కాకుండా వేరే భార్యలు ఉన్నారు.. వారి పేర్లు మీకు తెలుసా…?

-

మహాభారతం.. అంటేనే ఎంతచెప్పినా వొడవని ముచ్చట. ఆ మహా కావ్యంలో ఎన్నో వింతలు, విశేషాలు, విషయాలు. అయితే భారతంలో ప్రధానపాత్రలు అయిన పంచపాండవులకు అనేక విశేషాలు ఉన్నాయి. వారందరూ కలసి ఒకే భార్య అదేనండి ద్రౌపదిని వివాహం చేసుకున్నారు.కానీ వారికి ద్రౌపదే కాక  మరికొందరు భార్యలు ఉన్నారు. వారెవరు వారి పేర్లు అంటే చాలామందికి తెలియదు ఆ పేర్లు తెలుసుకుందాం…

ధర్మ రాజు భార్య-  దేవిక;

భీముడి భార్యలు- జలంధర;  హిడింబ

అర్జునుని  భార్యలు-  సుభద్ర; ఉలూచి; చిత్రాంగి;

నకులుడి భార్య- రేణుమతి

సహదేవుని భార్య.        ~  విజయ;

పాండవుల పూర్వీకుల భార్యలు:

శంతనుడి భార్యలు   – గంగ; సత్యవతి;

దుర్యోధనుని భార్య. – భానుమతి;

పరీక్షిత్ భార్య- మాద్రవతి;

జనమేజయుని భార్య-  వపుష్ట;

శతానీకుని భార్య-  వైదేహి;

 

పాండవులకు ద్రౌపది వల్ల కలిగిన పుత్రులు

ధర్మరాజు  – ప్రతివింద్యుడు;

భీముడు- శృతసోముడు;

అర్జునుడు      – శృతకీర్తి;

నకులుడు  – శతానీకుడు;

సహదేవుడు- శృతసేనుడు;

 

పాండవులకు ఇతర భార్యవల్ల కలిగిన పుత్రులు

ధర్మరాజు + దేవిక :  యౌధేయుడు;

భీముడు + జలంధర: సర్వగుడు;

భీముడు+ హిడింబ: ఘటోత్కచుడు;

అర్జునుడు + సుభద్ర: అభిమన్యుడు;

అర్జునుడు- ఉలూచి: ఇరావంతుడు;

అర్జునుడు+ చిత్రాంగి: బభ్రువాహనుడు;

నకులుడు + రేణుమతి : నిరమిత్రుడు;

సహదేవుడు+ విజయ: సుహోత్రుడు.

ఈ విశేషాలు అన్ని ప్రముఖ పండితులు బ్రహ్మశ్రీ మల్లాది చంద్ర శేఖర శాస్త్రిగారి వ్యాసాల నుంచి సేకరించాం.

  • కేశవ

Read more RELATED
Recommended to you

Latest news