ప్రముఖ నటి జయసుధ కుమారుడు నిహార్ వివాహ వేడుకలు ఢిల్లీలో జరిగాయి. అమృత్ కౌర్‌తో ఫిబ్రవరి 26న జరిగిన ఈ పెళ్లి వేడుకలో కుటుంబీకులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. అయితే సినీ పరిశ్రమ కోసం, తన సన్నిహితుల కోసం గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ వేడుకలో సినీ పెద్దలందరూ పాల్గొన్నారు.
మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ, నాగార్జున-అమల, నమ్రతా, దిల్ రాజు ఇలా సినీ ప్రముఖులు హాజరయ్యారు. అంతేకాకుండా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం ఈ వేడుకలో మెరిశాడు. మురళీమోహన్, నరేష్, టీఎస్సార్, కే రాఘవేంద్రరావు, వంటి సీనియర్స్ హాజరయ్యారు.
జయసుధ సమకాలీకులైన కుష్బూ, సుహాసిని వంటి నాటి అందాల తారలు కూడా ఈ ఈవెంట్‌లో మెరిశారు. మొత్తానికి జయసుధ కుమారుడి రిసెప్షన్ వేడుకలు హాట్ టాపిక్‌గా మారాయి. నిహార్ పెళ్లి సంగతేమో గానీ రిసెప్షన్ మాత్రం అందరి నోళ్లలో నానుతోంది. వీటికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి.