సాధారణంగా దేశంలో ఎక్కడైనా ఎన్నికలు వస్తే… మళ్ళీ ఫలితాలు ప్రకటించే వరకు ఆయా నియోజకవర్గాలలో సందడి మాములుగా ఉండదు. ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుండి ఫలితాలు వచ్చే వరకు నాయకులు డబ్బును మంచి నీళ్ల లెక్క ఖర్చు పెట్టక తప్పదు. అయితే వీరు ఎన్నికల్లో గెలవడానికి ఎంత అయినా ఖర్చు పెట్టడానికి వీలు ఉంటుందా ? లేదా డబ్బుకు ఏమైనా పరిమితులు ఉన్నాయా ? అంటే నిజమే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేయడానికి ఖర్చు చేయవలసిన మినిమం అమౌంట్ ఎంత అని చూస్తే రూ. 40 లక్షలు మాత్రమే. ఒకవేళ అంతకు మించి ఖర్చు చేస్తే అది ఖచ్చితంగా సెక్షన్ 123 (6) ప్రకారం అవినీతికి పాల్పడినట్లే లెక్క. అయితే ఆయా రాష్ట్రాల పరిమితులను బట్టి కొన్ని చోట్ల ఎక్కువ మరికొన్ని చోట్ల తక్కువగా నిర్ణయిస్తారు.
ఈ విషయాలు అన్నీ కూడా కండక్ట్ అఫ్ ఎలక్షన్ రూల్స్ 1961 లో రూల్ NO.9 లో పొందుపరచబడి ఉన్నాయి. మరి ఇప్పుడు దేశం మొత్తం మీద అయిదు రాష్ర్టాలలో నవంబర్ 30న జరగనున్న ఎన్నికలలో ఎవరు ఎంత ఖర్చు పెడతారో చూడాల్సి ఉంది.