తమిళ హీరో ధనుష్ సౌత్ అగ్ర హీరోలలో ఒకరు. తన సినిమాలు, నటనతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసే నటుడు ధనుష్.. తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా ఎంతో క్రేజ్ సంపాదించుకొని తనకంటూ ప్రత్యేక మార్కెట్ క్రియేట్ చేసుకున్న హీరో.. రజనీకాంత్ అల్లుడైనప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకొని అభిమానులు అలరిస్తున్నారు. ఇటీవల ధనుష్ నటించిన చిత్రం సర్. ఇప్పటికీ ఈ సినిమా విడుదలై తొమ్మిది రోజులు అవుతుండగా కలెక్షన్స్ ఎంత వచ్చాయంటే..
తాజాగా ధనుష్ నటించిన చిత్రం సర్ విడుదల అయ్యి మంచి హిట్ టాక్ను సంపాదించుకుంది. ఫిబ్రవరి 17న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు మంచి కలెక్షన్లనే వసూలు చేసింది.. వెంకీ అట్లూరి ఈ సినిమాకి దర్శకత్వం వహించగా.. భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ ధనుష్ సరసన హీరోయిన్గా నటించింది. కేవలం తమిళనాడులో మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో సర్ అనే టైటిల్ తో, తమిళంలో వేత అనే టైటిల్ తో ఈ చిత్రం ప్రేక్షకులకు ముందు వచ్చింది.
కాగా మొదటిరోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 2.65 కోట్ల రూపాయలను వసూలు చేయగా తొమ్మిదో రోజులు ముగిసే సరికి 13.95 షేర్ మరియు 25.90 కోట్ల గ్రస్స్ను వసూలు చేసి హిట్ స్టేటస్ లో నిలిచింది. కాగా 2022 ఆగస్టులో విడుదలైనటువంటి తీరు సినిమాతో ధనుష్ మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూలు చేసి ధనుష్ కెరియర్ లోనే మొట్టమొదటి 100 కోట్ల చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో నిత్యామీనన్ హీరోయిన్ గా నటించింది. కాగా సర్ సినిమాతో మరొక విజయాన్ని అందుకోవడం వల్ల ధనుష్ అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.