మారిటోరియం ఎలా అప్లై చేసుకోవాలి?

-

మార్చి 1 నుంచి 2020 మే 31 వరకు అన్ని టర్మ్ లోన్ల ఈఎంఐలకు, క్రెడిట్ కార్డ్ బిల్లులకు ఈఎంఐ మారిటోరియం ఉంటుందని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా చెప్పిన సంగతి తెలిసిందే. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా సూచనతో అన్ని బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు ఈఎంఐ మారటోరియంను అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఒక్కో బ్యాంకు ఒక్కో పద్దతిని అవలంభిస్తుంది.

ఏ బ్యాంకు కి ఏ విధంగా అప్లయ్ చేసుకోవాలో ఈ స్టొరీలో చూద్దాం…

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI : ఈఎంఐ మారటోరియం విషయంలో మూడు ఆప్షన్లు ఉంటాయి. వాయిదాలు ఎప్పట్లాగే చెల్లించడం, ఈఎంఐలను వాయిదా వేయడం, చెల్లించిన ఈఎంఐలను వెనక్కి తీసుకోవడం. మొదటి ఆప్షన్ ఎంచుకుంటే ఇబ్బంది లేదు. రెండో గాని మూడు గాని అయితే మీరు దరఖాస్తు పెట్టుకోవాలి ఆన్లైన్ లో.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ : ఈ బ్యాంకు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. లేదా 022-50042333, 022-50042211 నెంబర్లకు కాల్ చేయాలి.

ఐసీఐసీఐ బ్యాంక్ : ఎస్ఎంఎస్ లేదా ఇమెయిల్ ద్వారా ఒక లింక్ వస్తుంది. దాన్ని క్లిక్ చెయ్యాలి లేకపోతే https://www.icicibank.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి మారటోరియం ఎంచుకోవచ్చు.

యాక్సిస్ బ్యాంక్ : దీనికి ఆటోమేటిక్ గా వర్తిస్తుంది. లేదు ఈఎంఐ ఎప్పట్లాగే చెల్లించాలనుకుంటే మారటోరియం అవసరం లేదంటూ బ్యాంకుకు కచితంగా మెయిల్ చెయ్యాలి. లేకపోతే మీరు మారిటోరియం ఎంచుకున్నట్టే.

కెనెరా బ్యాంక్ : ఎస్ఎంఎస్ ద్వారా ఇన్‌స్ట్రక్షన్స్ ఇప్పటికే ఖాతాదారులకు పంపించింది. మారటోరియం కోరుకునే కస్టమర్లు ఎస్ఎంఎస్‌లో వెల్లడించినట్టుగా no అని రిప్లై ఇస్తే ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్ పేమెంట్, పోస్ట్ డేటెడ్ చెక్స్ లాంటివి మూడు నెలలు వాయిదా వేస్తారు.

ఐడీఎఫ్‌సీ బ్యాంక్ : ఇమెయిల్ అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇమెయిల్‌లో లోన్ వివరాలు వెల్లడిస్తే చాలు.

ఐడీబీఐ బ్యాంక్ : ఆటోమెటిక్‌గా అన్ని అకౌంట్లకు మారటోరియం వర్తిస్తుంది. ఈఎంఐ చెల్లించాలనుకుంటే మాత్రం 2020 ఏప్రిల్ 3 లోగా [email protected] ఇమెయిల్ ఐడీకి మీ లోన్ వివరాలతో మెయిల్ పంపాల్సి ఉంటుంది.

అన్ని బ్యాంకు లు ఇలాగే ఉన్నాయి. బ్యాంకు కి ఒకసారి కాల్ చేసి వివరాలు తెలుసుకోండి. డబ్బులు ఉంటే లోన్ కట్టుకోవడమే చాలా ఉత్తమం. లేకపోతే అనవసరంగా వడ్డీ కట్టాలి.

Read more RELATED
Recommended to you

Latest news