ఫేస్‌బుక్ అకౌంట్‌లో మీ పేరును ఛేంజ్ చేసుకోవటం ఎలా..?

-

కమ్యూనికేషన్ ప్రపంచంలో సరికొత్త ఒరవడికి నాందిపలికిన ఫేస్‌బుక్ దాదాపుగా అన్ని స్మార్ట్‌ఫోన్‌లలోనూ తప్పనిసరి యాప్‌గా మారిపోయింది. ఆండ్రాయిడ్ యూజర్ల దగ్గర నుంచి ఐఓఎస్ యూజర్ల వరకు ప్రతి ఒక్కరూ ఫేస్‌బుక్ సేవలను నిరాటకంగా వినియోగించుకోగలుగుతున్నారు. యూజర్ ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియన్స్‌‌‌‌‌‌ను ఆఫర్ చేసే విషయంలో అత్యుత్తమ ప్లాట్‌ఫామ్‌గా గుర్తింపుతెచ్చుకున్న ఫేస్‌బుక్‌‌ను నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకునే వీలుంటుంది. ఫేస్‌బుక్ అకౌంట్‌లలో పాస్‌వర్ట్స్ ఛేంజ్ చేయాలన్నా, సెక్యూరిటీ సెట్టింగ్స్ లేదా ప్రైవసీ సెట్టింగ్స్ మార్చాలన్నా ఆ ప్రాసెస్ సెకన్లలో వ్యవధిలో జరిగిపోతుంది. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా ఫేస్‌బుక్ అకౌంట్‌లో మీ పేరును ఏ విధంగా ఛేంజ్ చేసుకోవాలి అనే దాని గురించి స్టెప్ బై స్టెప్ గైడ్‌ను తెెలుసుకుందాం..

facebook

“Account Settings”లోకి వెళ్లి..

ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లోని ఫేస్‌బుక్ యాప్‌ను ఓపెన్ చేసి స్ర్కీన్ టాప్ రైట్ కార్నర్‌లో కనిపించే మెనూ (మూడు చక్కుల) ఆప్షన్ పై టాప్ ఇవ్వండి. మెనూలోకి ప్రవేశించిన తరువాత “Settings and Privacy” ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని “Account Settings”లోకి వెళ్లండి. అకౌంట్ సెట్టింగ్స్‌లోకి వెళ్లిన తరువాత “General” పేరుతో మరో ఆప్షన్ మీకు కనిపిస్తుంది. ఈ ఆప్షన్‌ను సెలక్ట్ చేసకున్నట్లయితే మీ పేరు, మెయిల్ ఐడీ ఇంకా మొబైల్ నెంబర్‌తో కూడిన డిటెయిల్స్ కనిపిస్తాయి. వీటిని manage account ఆప్షన్ ద్వారా నచ్చిన విధంగా మేనేజ్ చేసుకునే వీలుంటుంది.

అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ పొందాలంటే నెలకు రూ.129 చెల్లిస్తే చాలు

“Change Name” ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని..

మీ పేరును ఛేంజ్ చేయాలనుకుంటున్నట్లయితే స్ర్కీన్ పై కనిపించే “Change Name” ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని ఫేస్‌బుక్ నేమ్ స్టాండర్డ్స్ ప్రకారం మీ ఫస్ట్, మిడిల్ ఇంకా లాస్ట్ నేమ్‌లను ఎంటర్ చేయండి. ఒకసారి మార్చిన పేరును 60 రోజుల వరకు మార్చటం సాధ్యపడదు. కాబట్టి పేరును ఛేంజ్ చేసే ముందు ఎంటర్ చేసిన డిటెయిల్స్‌ను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవటం మంచిది.

“Save changes” ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవటం ద్వారా..

“Add or change the language-specific name” ఆప్షన్ పై క్లిక్ చేయటం ద్వారా మీ పేరు ఏ భాషలో కనిపించాలన్నది కూడా డిసైడ్ చేసుకోవచ్చు. మీ నేమ్ ఫీల్డ్స్‌ను అప్‌డేట్ చేసుకున్న తరువాత “Review Change” ఆప్షన్ పై టాప్ ఇచ్చి సంబంధిత డిస్‌ప్లే ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవల్సి ఉంటుంది. ఈ ఛేంజ్‌ను కన్ఫర్మ్ చేసేందుకు ఫేస్‌బుక్ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయవల్సి ఉంటుంది. అంతిమంగా “Save changes” ఆప్సన్ పై టాప్ చేయటం ద్వారా ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో మీ పేరు విజయవంతంగా మార్పు చేయబడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news