మధుమేహం వచ్చాక తగ్గుతుందా.. తగ్గాలంటే ఏం చేయాలి..?

-

ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని బాధిస్తోన్న ఆరోగ్య సమస్య డయాబెటిస్. కొందరికి జన్యుపరంగా పుట్టినప్పటి నుంచే వస్తే.. మరికొందరికి మధ్యలో అటాక్ అవుతోంది. ఇంకొందరికి వారి జీవనశైలి వల్ల సోకుతోంది. ఎలా వచ్చినా ఒకసారి డయాబెటిస్ వచ్చిందంటే నయం కావడం అసాధ్యం. అందుకే డయాబెటిస్ రాకుండా ముందే జాగ్రత్తపడాలి. ఒకవేళ వచ్చినా.. నియంత్రణలో ఉంచుకోవాలి.

 

డయాబెటిస్‌ వచ్చినవాళ్లకి తగ్గడం అనేది ఓ పట్టాన సాధ్యం కాదు. కానీ తక్కువ పిండిపదార్థాలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే కొంతకాలానికి మధుమేహం తగ్గే అవకాశం ఉందంటున్నారు కాలిఫోర్నియా యూనివర్సిటీ నిపుణులు. క్యాలరీలు తక్కువ ఉండే పండ్లూ కూరగాయల్ని డైట్ లో భాగం చేసుకుంటే మధుమేహంతో నెమ్మదిగా తగ్గే అవకాశముందని తమ అధ్యయనంలో తేలిందట.

ఒకసారి మధుమేహం వచ్చిందంటే నయం కావటం అసాధ్యం. అందుకే  నియంత్రణలో ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. అదెలా సాధ్యమంటే.. జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే సరి మధుమేహాన్ని కంట్రోల్ లో ఉంచుకోవచ్చట. అవేంటంటే..

వ్యాయామం తప్పనిసరి..  జీవనశైలి మార్పుల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది వ్యాయామం. మధుమేహ నివారణలో ఇంతకుమంచి తేలికైన, చవకైన మార్గం మరోటి లేదు. అయితే కొందరికి ఎంత వ్యాయామం చేసినా పెద్దగా ఫలితం కనిపించదు. ఎందుకిల జరుగుతోందని హాంకాంగ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు అధ్యయనం చేశారట. వారి అధ్యయనంలో ఏం తేలిందంటే..?

మధుమేహ దశలో ఉన్న కొందరిని ఎంచుకొని.. వ్యాయామానికీ పేగుల్లోని బ్యాక్టీరియా, జీవక్రియలకూ గల సంబంధం మీద అధ్యయనం చేశారు. వ్యాయామంతో గ్లూకోజు జీవక్రియలు, ఇన్సులిన్‌ స్పందనలు మెరుగుపడినవారి పేగుల్లో భిన్నమైన బ్యాక్టీరియా ఉంటున్నట్టు గుర్తించారు. ఈ బ్యాక్టీరియా కొవ్వు ఆమ్లాలను మరింత ఎక్కువగా పుట్టిస్తుండటం, అమైనో ఆమ్లాలను ఇంకాస్త అధికంగా విడగొడుతుండటం విశేషం. వీరిలో జీవక్రియలు చురుకుగా సాగుతున్నాయనటానికి ఇది నిదర్శనం.

పేగుల్లోని బ్యాక్టీరియాను మార్చుకోగలిగితే వ్యాయామ ఫలితాలను వీలైనంత ఎక్కువగా పొందే వీలుందని అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి. ఇకపై కేవలం వ్యాయామం మీదే కాకుండా.. పేగుల్లో మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేసే పెరుగు, మజ్జిగ వంటివి క్రమం తప్పకుండా తినటంపైనా దృష్టి సారించాలని నిపుణులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news