ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడం చాలా మందికి ఐడియా ఉంటుంది కానీ.. పాన్‌కార్డును ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలియదు. పైగా ఆధార్ కార్డు అంటే అన్నింటికి కావాలి. ఇది కనబడకపోయినా.. వెంటనే డౌన్‌లోడ్ చేసుకుంటాం. ఒకవేళ పాన్ కార్డుపోతే.. మళ్లీ డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఎలా..? మీ పాన్ కార్డు ఎక్కడైనా పడిపోయినా, పోగొట్టుకున్న మీరు ఆన్‌లైన్‌లో సులభంగా ఇ-పాన్ కార్డ్‌ని పొందవచ్చు. కేవలం 10 నిమిషాల్లోనే ఇ-పాన్‌డౌన్ లోడ్ చేసుకోవచ్చు తెలుసా.?
e-PAN కార్డ్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..
ముందుగా ఆదాయపు పన్ను శాఖ పోర్టల్‌కి లాగిన్ అవ్వండి (https://www.incometax.gov.in/iec/foportal/):
మీరు హోమ్ పేజీ ఓపెన్ చేసి మీకు అక్కడ కనిపించే Instant e-PAN ఆప్షన్ పై క్లిక్ చేయండి.
కొత్త ఇ-పాన్ పేజీలో గెట్ న్యూ ఇ-పాన్‌పై క్లిక్ చేయండి.
కొత్త ఇ-పాన్ పేజీలో ఆధార్ నంబర్‌ను నమోదు చేసిన తర్వాత కన్ఫర్మ్ చెక్‌బాక్స్‌ని ఎంచుకుని.. కొనసాగించుపై క్లిక్ చేయండి.
OTP ధ్రువీకరణ పేజీలో నేను నిబంధనలను చదివాను మరియు కొనసాగడానికి అంగీకరిస్తున్నాను అనే బటన్‌పై క్లిక్ చేయండి.
ఇప్పుడు ఆధార్‌తో లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌కు 6 అంకెల OTP వస్తుంది, దానిని మీకు ఇవ్వబడిన బాక్స్‌లో ఎంటర్ చేయండి.
UIDAIతో ఆధార్ వివరాలను ధృవీకరించడానికి చెక్‌బాక్స్‌ని ఎంచుకుని కొనసాగించుపై క్లిక్ చేయండి.
ధ్రువీకరణ ఆధార్ వివరాల పేజీలో నేను అంగీకరిస్తున్నాను చెక్‌బాక్స్ ఆప్షన్‌ను ఎంచుకుని, కొనసాగించు క్లిక్ చేయండి.
దీని తర్వాత మీ మొబైల్ నంబర్‌కు సక్సెస్ అయినట్లు మెసేజ్ వస్తుంది. దాని ఐడీని గుర్తించుకోండి.
అనంతరం మీరు మీ యూజర్ ఐడి మరియు పాస్‌వర్డ్‌తో ఇ-ఫైలింగ్ పోర్టల్‌కి లాగిన్ అవ్వండి. ఆ తర్వాత డ్యాష్‌బోర్డ్‌లో సర్వీస్ ఇ-పాన్ యొక్క వ్యూ/డౌన్‌లోడ్ ఎంపికపై క్లిక్ చేయండి.
దీని తర్వాత మీ 12 అంకెల ఆధార్ నంబర్ ఎంటర్ చేసి క్లిక్ చేయండి. అనంతరం మీ మెుబైల్ కు ఓటీపీ వస్తుంది. దానిని నమోదు చేసిన తర్వాత మీరు మీ పాన్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అంతే సింపుల్‌గా పాన్‌కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రాసెస్ కొంచెం పెద్దగా అనిపిస్తుందా..? మళ్లీ ఒక్కసారి చదివి స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోండి.