ఆడవారి ఆరోగ్యాన్ని పెంచే కుసుమలు.. ఎలా తినాలంటే.?

-

కుసుములను ప్రొద్దుతిరుగుడు విత్తనాలు అని కూడా పిలుస్తారు. కంటికి నింపుగా కనిపిందు చేసే పొద్దు తిరుగుడు పువ్వులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించి నూనెగా సన్ఫ్లవర్ ఆయిల్ ప్రసిద్ధి చెందింది. ఇందులో చర్మం,జుట్టుకు ఉపయోగపడే అనేక పోషకాలతో పాటు మన శరీరారోగ్యానికి ఉపయోగపడే పోషక పదార్థాలు ఉన్నాయి.కుసుములలో విటమిన్ సి, ఇ లతో పాటు మెగ్నీషియం, క్యాల్షియం, ఫైబర్,ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు,సెలీనియం వంటి కణజాలు మరియు ఆంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా కలిగి ఉంటాయి. తరుచుగా సన్ఫ్లవర్ సీడ్స్ ను తీసుకోవడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటో చూద్దాం.

కుసుములలో విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. ఇది గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాలాలలో ఏర్పడే సమస్యను తగ్గిస్తుంది.అందువల్ల గుండెకు రక్త సరఫరా బాగా జరిగి అకస్మాత్తుగా వచ్చే గుండెపోటు సమస్యల్ని నివారిస్తుంది. అలానే గుండెను ఆరోగ్యంతో ఉంచుతుంది.కుసుమలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇవి శరీరంలో జీవక్రియలను వేగవంతం చేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన జీర్ణక్రియ వ్యర్ధాలను బయటకు పంపుతుంది.అందువల్ల మలబద్దక సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.

కుసుములలో సెరటోనిన్ అనే పదార్థం ఉంటుంది.ఇది ఒత్తిడి మరియు ఆందోళన తగ్గించి విశ్రాంతిని కలుగజేస్తుంది.అందువల్ల డిప్రెషన్ తో బాధపడేవారు తరచూ సన్ఫ్లవర్ సీడ్స్ ను తీసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుసుములలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మ మరియు కేశ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో ఉండే విటమిన్ ఇ చర్మాన్ని ఫ్రీరాడికల్స్ భారీ నుండి కాపాడుతుంది. చర్మాన్ని కాంతివంతంగా మార్చడంతో పాటు ముడతల సమస్యలను నివారిస్తుంది.

కుసుములు శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గిస్తుంది.ఇందులో ఉండే ఫైబర్ అధిక బరువు మరియు ఊబకాయ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.ఇందులో ఉండే పాలి అన్ సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు మరియు ఒమేగా ఆమ్లాలు శరీరంలో ఏర్పడే చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి.
కుసుములు విటమిన్ ఇ,సెలీనియం మరియు కాపర్ ను కలిగి ఉంటాయి. ఇవి మన శరీరానికి సహజమైన యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కు కారణం అయ్యే సెల్యులర్ డ్యామేజ్ ను నివారిస్తాయి. ప్రేగులలో ఏర్పడే క్యాన్సర్ ను నియంత్రిస్తుంది.అంతేకాకుండా పురుషులలో ఏర్పడే వందత్వాన్ని నివారిస్తాయి. ఇందులో ఉండే క్యాల్షియం ఎముకలను ఆరోగ్యంతో ఉంచుతుంది.ఇందులో ఉండే మెగ్నీషియం నాడీ వ్యవస్థకు విశ్రాంతి ఇచ్చి అధిక ఒత్తిడిని తగ్గిస్తుంది. దాంతో మైగ్రేన్ తలనొప్పి వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news