ఆందోళనను అంతం చేయండిలా..!

-

మనలో కలిగే ఆందోళనతో తీవ్ర ఇబ్బందులకు గురవుతాము. దీని ప్రభావం ఉద్యోగం, వ్యాపారాలు, చదువు, లక్ష్యాలపై ప్రభావం చూపిస్తుండటంతో నష్టాలను చవి చూడాల్సి వస్తోంది. ఆందోళన కలిగినప్పుడు మనలో ఎదో అయిపోతుందనే భావన కలిగి మనస్సును ప్రశాంతంగా ఉండనివ్వదు. దీంతో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. కొన్ని సింపుల్‌ పద్ధతులను పాటించి ఇలాంటి ఆలోచన ధోరణిని మార్చుకొని ఆందోళనను అంతం చేయవచ్చు. దాని కోసం 5–1 ట్రిక్స్‌ను పాటిస్తే చాలు. మన జ్ఞానేంద్రియాలతో ముడిపడిఉన్న ఈ ట్రిక్‌ చాలా సింపూల్‌ ఎక్కడైనా, ఎప్పుడైనా వాడవచ్చు.

 

ఏమిటీ 5–1..?

5. మీ చుట్టుపక్కలా, పరిసరాల్లో ఏవైన 5 వస్తువులు, టీవీ, ఫ్యాన్, టేబుల్‌ బ్లాక్‌బోర్డు లాంటి వస్తువులను మనసారా చూడండి.
4. మీ ఇంట్లో , ఆఫీస్‌లో కాని మీకు అనుకూలంగా ఉన్న నాలిగింటిని తాకండి. వాటిని తాకుతున్నప్పుడు మీ చేతులకు కలిగే స్పర్శను మెల్లిమెల్గిగా మనస్సులో ఊహించుకోండి. ఇంట్లో పెంచుకునే రామచిలుకను తాకితే అది మీ చేతిని కొరినప్పుడు కలిగే చెక్కిలిగింత, పెంపుడు కుక్కను నిమురుతున్నప్పు మెత్తదనం ఫ్రిజ్‌ తెరిచినప్పుడు వచ్చే చల్లదనం వంటివి.
3. ఏవైన మూడు శబ్దాలను ఏకాగ్రతతో వినండి. ఉదాహరణకు: మీ సమీపంలో వచ్చే మ్యూజిక్‌ కావొచ్చు. నడక శబ్దం కావొచ్చు. చిన్న పిల్లల నవ్వులు కావొచ్చు ఏవైన శ్రద్ధగా మనస్సు పెట్టి వినాలి.
2. ఏవైన రెండు వాసనిచ్చే పేర్లను ఊహించుకొని వాటి వాసనను మీరు గ్రహిస్తున్నట్లు ఊహించుకోవాలి. ఒకవేళ మల్లేపూల పరిమళమైతే మీకు అందుబాటులో ఉంటే వాటి వాసన పీల్చుకోవచ్చు.
1. రుచి చూడగలిగిన ఓ వస్తువును గుర్తించండి. మీకు సమీపంలో అలాంటివేవీ లేకపోతే మీ జేబులో జాక్లెట్, లవంగా, సోంపు వంటిని నోట్లో వేసుకొని వాటి రుచిని ఆస్వాదించండి.
ఇలా చుట్టుపక్కల వస్తువులను చూడటం, ఇష్టమైన వాటిని తాకడం వంటివైపు దృష్టి సారిస్తే మనసు వర్తమానంలోకి వచ్చేస్తుంది. గతాన్ని గుర్తు చేసుకొని బాధపడటం, భవిష్యత్‌ ఊహించుకొని బెంగ పడటం లాంటివి ఉండవు.

Read more RELATED
Recommended to you

Latest news