ఢిల్లీ కి ఉత్తమ్…కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీలో కసరత్తు ముగిసింది. రెండు నియోజకవర్గాలకు కలిపి ఆరుగురి పేర్లు ప్రతిపాదించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈరోజు ఢిల్లీకి ఉత్తమ్ వెళుతుండడం సంచలనంగా మారింది. అయితే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చేసింది. అధిష్టానానికి పీసీసీ పేర్లు పంపుతున్న క్రమంలోనే ఉత్తమ్ ఢిల్లీకి వెళుతున్నట్టు చెబుతున్నారు.

రంగారెడ్డి..హైదరాబాద్.. పాలమూరు నియోజకవర్గం నుండి … మాజీ మంత్రి చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డిల పేర్లు ఖరారు అయినట్టు చెబుతున్నారు. అలానే వరంగల్..ఖమ్మం.. నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుండి… రెండు పేర్లు సిఫారసు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, బెల్లయా నాయక్ పేర్లు వినిపిస్తున్నాయి.  అధికార పార్టీ నుండి… కాంగ్రెస్ లోకి వచ్చారన్న కారణంతో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పరిశీలనలో  రాములు నాయక్ పేరు ఉందని అంటున్నారు.