మొదటి ముద్దుతో భాగస్వామిని ఇంప్రెస్ చేయాలంటే ఇవి తెలుసుకోవాల్సిందే..

మొదటి ముద్దు ఎప్పటికీ ప్రత్యేకమే. నరాల తీవెలపై అనుభూతుల రాగాలను ఆలపించి మనసుకు కమ్మని సంగీతాన్ని వినిపించే శక్తి మొదటి ముద్దుకి ఉంది. భాగస్వామితో గడిపిన క్షణాల్లో నెమరువేసుకోవడానికి ఉపయోగపడేది అదే. మరి అంతటి ముద్దు కోసం మీరు రెడీగా ఉన్నారా? మొదటి ముద్దుతో మీ భాగస్వామిని ఇంప్రెస్ చేయగలారా? ఇంప్రెస్ చేయడానికి ఏం చేయాలో మీకు తెలుసా? ఇది తెలుసుకోండి.

తొందరపడవద్దు

మీ భాగస్వామితో మొదటి ముద్దుకి తొందరపడవద్దు. దానివల్ల అవతలి వారు డిస్టర్బ్ అయ్యే ప్రమాదం ఉంది. వారి కంఫర్ట్ జోన్ దాటి వెళ్ళడం ఎప్పుడూ మంచిది కాదు. మీపై చెడు అభిప్రాయం కలగడానికి మీ తొందరపాటు కారణం కావచ్చు జాగ్రత్త.

ఆలస్యం వద్దు

కొన్ని కొన్ని సార్లు ఆలస్యం వల్ల అవతలి వారు తామంటే మీకు ఇష్టం లేదనుకునే అవకాశం ఉంది. సరైన సమయంలో సరైన సందర్భంలో ఆలస్యం చేయకూడదు.

తీవ్రమైన వాంఛ

మీ భాగస్వామి మిమ్మలని, మీ పెదాలని పదే పదే చూస్తూ ఉండి, మీరంటే ఇష్టం ఉన్నట్లు కనిపిస్తుంటే ముద్దు పెట్టడానికి అదే సరైన సమయంగా చెప్పవచ్చు. వారు కావాలనుకున్నప్పుడు ఇవ్వడమే సరైన పద్దతి.

గుడ్ బై చెప్తూ చుట్టూ తిరగడం

చెరో దిక్కూ వెళుతూ వెళ్ళలేక బై చెప్తూ అక్కడక్కడే తిరుగుతూ ఉన్నారంటే అది ముద్దుతో తీరే ఎమోషన్ అయి ఉండవచ్చు. మీ భాగస్వామి మిమ్మల్ని వదిలి ఉండలేకపోతున్నాననే విషయాన్ని ఆ విధంగా చెబుతూ ఉండవచ్చు.

కాబట్టి సరైన సందర్భంలో సరైన సమయంలో మొదటి ముద్దుతో మీ భాగస్వామిని ఇంప్రెస్ చేయండి.