పోలీస్ పాస్ అప్లై ఎలా చేసుకోవాలో చూడండి…!

-

లాక్ డౌన్ లో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళడం అనేది చాలా కష్టంగా మారిన అంశం. చాలా మంది అత్యవసర పరిస్థితులు ఉన్నా సరే ఎలా వెళ్ళాలో అర్ధం కాక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఎక్కడ తాట తీస్తారో అనే భయంతో జనాలు ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. దీనితో కొన్ని ప్రాంతాల్లో అధికారులు పాస్ లు ఇస్తున్నారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళడానికి ఈ పాస్ ఉపయోగపడుతుంది.

దీనిపై ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ కీలక ప్రకటన చేసారు. అత్యవసరమైన పనుల కోసం ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లాలనుకునేవారు పోలీస్ పాస్ తీసుకోవాలని ఆయన కోరారు. తగిన కారణాలు, ఆధారాలు చూపించి ఇ-పాస్‌కు దరఖాస్తు చేయొచ్చని ఆయన మీడియాకు వివరించారు. ఏపీలో ప్రభుత్వం అలాంటి వారికి వారికి ఎమర్జెన్సీ ట్రావెల్ పాస్‌లను జారీ చేస్తుంది.

జిల్లా పరిధిలో వెళ్లాలి అనుకుంటే మాత్రం జిల్లా ఎస్పీకి దరఖాస్తు చేసుకోవాలి. జిల్లా దాటి వెళ్లాలంటే తమ జిల్లా ఎస్పీ ద్వారా వెళ్లాలనుకున్న జిల్లా ఎస్పీ నుంచి పర్మిషన్ అత్యవసరం. ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే మాత్రం ఎస్పీ ద్వారా డీఐజీ ఆఫీసుకి అప్లై చేసుకోవాలి. పోలీసులు దరఖాస్తుదారుల వివరాలన్నీ పరిశీలించి సరైన కారణాలు ఉంటే ఇ-పాస్ మంజూరు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం.

అత్యవసర పనులపై ప్రయాణించాలనుకునేవారు పాస్ తీసుకోవడానికి ఆధార్ నెంబర్, వాహనం నెంబర్, అడ్రస్, ప్రయాణికుల సంఖ్య, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తారు అనే వివరాలు వెల్లడించాలీ. వాట్సప్ నెంబర్, ఇమెయిల్ ఐడీకి అప్లై చేయాలి. పోలీసులు దరఖాస్తులను పరిశీలించిన తర్వాత దరఖాస్తుదారుల మొబైల్ నెంబర్లకే ఇ-పాస్‌లను పంపిస్తూ ఉంటుంది ప్రభుత్వం. తనిఖీ సమయంలో ఈ పాస్ చూపించాలి.

యూనిట్ పేరు వాట్సప్ నెంబర్ ఇమెయిల్ ఐడీ
శ్రీకాకుళం 6309990933 [email protected]
విజయనగరం 9989207326 [email protected]
విశాఖ రూరల్ 9440904229 [email protected]
విశాఖసిటీ 9493336633 [email protected]
తూ గో 9494933233 [email protected]
రాజమండ్రి అర్బన్ 9490760794 [email protected]
పశ్చిమ గోదావరి 8332959175 [email protected]
కృష్ణా (మచిలీపట్నం) 9182990135 [email protected]
విజయవాడ సిటీ 7328909090 [email protected]
గుంటూరు రూరల్ 9440796184 [email protected]
గుంటూరు అర్బన్ 8688831568 [email protected]
ప్రకాశం 9121102109 [email protected]
నెల్లూరు 9440796383 [email protected]
చిత్తూరు 9440900005 [email protected]
తిరుపతి అర్బన్ 9491074537 [email protected]
అనంతపురం 9989819191 [email protected]
కడప 9121100531 [email protected]
కర్నూల్ 7777877722 [email protected]

Read more RELATED
Recommended to you

Latest news