లాక్ డౌన్ నేపధ్యంలో ఇబ్బందులు పడుతున్న వారికి కేంద్రం ఆర్ధిక సహాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. జనధన్ ఖాతాల్లో మహిళలకు మూడు నెలలకు గానూ 1500… అంటే నెలనేలా 500 చొప్పున జమ చేస్తుంది. గత నెలలో మొదటి విడత జమ చేసిన కేంద్ర సర్కార్… రెండు విడత నగదుని ఈ నెల జమ చేసింది. దీని ద్వారా పేద మహిళలకు అండగా నిలవాలని వారికి ఇబ్బందులు లేకుండా రాష్ట్రాల సహకారంతో ముందుకు రావాలని భావించింది.
అయితే ఈ డబ్బు తీసుకునే వాళ్లకు కొన్ని నిబంధనలు ఉంటాయని కేంద్రం ఒక ప్రకటనలో చెప్పింది. అకౌంట్ నంబర్ చివర్లో 0, 1 ఉన్న ఖాతాదారులు తమ సొమ్ముని సోమవారం తీసుకోవాలి అని కేంద్రం సూచించింది. చివర్లో 2,3 అంకెలు ఉన్న వాళ్లు మే 5వ తేదీన తీసుకోవాలని, 4,5 ఉన్నవాళ్లు మే 6న డబ్బులు తీసుకోవాలని సూచించింది కేంద్రం. చివర్లో 6,7 నెంబర్లు ఉన్నవాళ్లు మే 8న డబ్బులు తీసుకోవాలని చెప్పింది.
చివర్లో 8,9 ఉన్న వాళ్లు మే 11న తమ సొమ్మును తీసుకోవాలని సూచనలు చేసింది. మే 11 తరువాత ఎవరైనా ఎక్కడైనా తమ డబ్బును తీసుకోవచ్చు అని స్పష్టం చేసింది. దీనికి కారణం ఏంటీ అంటే… బ్యాంకుల దగ్గర రద్దీని నియంత్రించేందుకు గానూ ఈ నిర్ణయం తీసుకుంది. కొందరు బ్యాంకు ల వద్ద బారులు తీరుతున్న నేపధ్యంలో కరోనా సోకే అవకాశం ఉందని భావించి ఈ నిర్ణయం తీసుకుంది.