వలస కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రైలు సర్వీసులను ప్రారంభించిన సంగతి తెలిసిందే. వేలాది మంది వలస కూలీలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రారంభించిన రైలు సర్వీసుల్లో తమ సొంత ఊర్లకు తరలి వెళ్తున్నారు. తెలంగాణా, ఏపీ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో భారీగా వలస కూలీలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ రైలు ఎక్కిన ఒక యువకుడు వింత పరిస్థితిని ఎదుర్కొన్నాడు.
ఈ నేపధ్యంలో కోటా నుండి హటియాకు వెళ్తున్న ఒక ప్రత్యేక రైలు ఎక్కాడు ఆ వ్యక్తి. ఒడిశాలోని రూర్కెలా స్టేషన్ సమీపంలో రైలు ఆగుతుంది అనుకున్నా అది ఆగలేదు. దీనితో ఎం చెయ్యాలో అర్ధం కాక రైలు నుంచి దూకాడు. సదరు వ్యక్తి తన వివరాలు తప్పుగా నమోదు చేసుకుని, రైలు ఎక్కాడు.
రూర్కెలాలో రైలు ఆగకపోవడంతో అతను భయంతో రైలు నుంచి కిందకు దూకినట్టు మీడియాకు సమాచారం అందింది. అయితే అతని వివరాలు పూర్తిగా భద్రపరిచారు పోలీసులు. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయని అధికారులు వివరించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు.