సాధారణంగా శరీరానికి శక్తిని అందించే పోషకాలలో బాదం, వాల్ నట్స్, జీడిపప్పుతో పాటు ఖర్జూరం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. శరీరంలో రక్తం యొక్క స్థాయిని పెంచడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ మధ్యకాలంలో చాలామంది తీసుకునే ఆహారంలో పోషకాల వల్ల త్వరగా ముసలి వాళ్లు అయిపోతున్నారు. ఏ పని త్వరగా చేయలేకపోతున్నారు. వారిని బద్ధకం ఆవహిస్తోంది పైగా శరీరంలోని ఎముకలు కూడా బలాన్ని కోల్పోతున్నాయి. తద్వారా ఏ పని కూడా వేగంగా, హుషారుగా చేయలేకపోతున్నారు ..త్వరగా ఎముకలు విరగడం వంటి సమస్యలతో కూడా బాధపడుతున్నారు. అయితే చిన్న వయసులోనే ఇలాంటి ఎముకల సమస్య రావడానికి కారణం క్యాల్షియం లోపమే.
మరి ఈ కాల్షియం లోపం పూరించాలి అంటే కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి . వాటిలో ఖర్జూరం కూడా ఒకటి. ఖర్జూరం ఎముకలకు బలాన్ని చేకూర్చడమే కాకుండా మరెన్నో రకాలుగా ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో కాల్షియం,మెగ్నీషియం,కాపర్ సమృద్ధిగా ఉన్నాయి.ఇవి మన ఎముకలను దృఢంగా ఉంచుతాయి. అందుకే క్రమం తప్పకుండా ప్రతిరోజు ఖర్జూరాలను తీసుకోవాలి. అంతేకాకుండా మన దంతాలని ధ్రుడపరచడంలో కీలకపాత్ర పోషిస్తాయి.
జలుబు,గొంతులోని శ్లేష్మాన్ని తగ్గిస్తుంది. రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు పెద్ద ప్రేగులోని సమస్యలను నివారిస్తాయి. తిన్న వెంటనే శరీరానికి వేగవంతమైన శక్తిని ఇస్తాయి. బాగా సన్నగా ఉన్నవారు ఆరోగ్యంగా బరువు పెరగాలి అంటే ప్రతిరోజు రాత్రిపూట నీటిలో నానబెట్టిన ఖర్జూరాలను ఉదయాన్నే మిక్సీ పట్టి ఆ మిశ్రమాన్ని పాలలో కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన అన్ని పోషకాలు లభిస్తాయి. పైగా ఆరోగ్యంగా బరువు పెరుగుతారు. అలాగే మలబద్ధకం సమస్యను కూడా దూరం చేసుకోవచ్చు. ఇలా ఇన్ని ఔషధ గుణాలున్న ఖర్జూరాలను రోజు తీసుకుందాం…ఆరోగ్యంతో జీవిద్దాం..