ఇటీవల కాలంలో మహిళల్లో తరచూ కనిపించే అనారోగ్య సమస్యలలో రక్తహీనత కూడా ఒకటి. ఈ సమస్య వల్ల త్వరగా అలసిపోయినట్టు అనిపించడం.. కళ్ళు తిరగడం.. నీరసం తో పాటు చర్మం పొడిబారి పోవడం వంటి ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి రక్తహీనతను తగ్గించుకోవాలి అంటే కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే సరిపోతుందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా రక్తహీనతను తగ్గించడంలో పల్లీలు చాలా చక్కగా సహాయపడతాయి. అయితే పల్లీలను ప్రతిరోజు రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా నీటిలో నానిన పల్లీలను క్రమం తప్పకుండా.. ఒక రెండు నెలల పాటు తిన్నట్లయితే రక్తహీనత సమస్యను తగ్గించుకోవచ్చు.
ఒకవేళ పచ్చిగా తినలేము అని భావించేవారు ఉడకబెట్టుకొని తిన్నా సరే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా పల్లీలు ఒక రక్తహీనత సమస్యను మాత్రమే కాదు మరెన్నో అనారోగ్య సమస్యలను కూడా దూరం చేస్తాయి. జుట్టు సంబంధిత సమస్యలను దూరం చేయడంతో పాటు చర్మ సంబంధిత సమస్యలను కూడా నివారిస్తాయి.
గాల్ స్టోన్స్ ని తగ్గిస్తాయి:
రోజు పల్లీలు తింటే గాల్ స్టోన్స్ వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయని సైంటిస్టులు చెబుతున్నారు.
పోషకాహార లోపం రాకుండా చేస్తాయి:
రోజు పల్లీలు తినడం వల్ల పోలిక్ యాసిడ్ ఎక్కువగా లభిస్తుంది. గర్భిణీలు రోజు తినడం వలన బిడ్డ ఎదుగుదల సరిగా ఉంటుంది.పోషకాహార లోపం లేకుండా బిడ్డ జన్మనిచ్చేందుకు అవకాశం ఉంటుంది.
అల్జీమర్స్ వ్యాధిని తగ్గిస్తాయి:
వయసు మీద పడడం కారణంగా సహజంగానే కొందరికి ఆల్జీమర్స్ వ్యాధి వస్తుంటుంది. అయితే పల్లీలను తింటే ఆ వ్యాధి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వృద్ధాప్యంలో మతిమరుపు ఎక్కువగా రాకుండా ఉంటుంది.
శరీరానికి మేలు చేస్తాయి:
పల్లీలలో ఉండే పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, మాంగనీస్ , కాపర్, సోడియం , జింక్ వంటి పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. అలాగే జీవక్రియ సక్రమంగా జరగడానికి కావలసిన మినరల్స్ ను అందిస్తాయి.