కేటీఆర్, ఎంపీ సంతోష్ లకు భారీ షాక్…యాక్షన్ ప్లాన్‌కు సిద్ధమైన HRC

తెలంగాణ మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌ గౌడ్‌ మరియు రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ కుమార్‌ లకు దిమ్మ తిరిగే షాక్‌ తగిలింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హరిత హారం పేరుతో తెలంగాణ వ్యాప్తంగా మొక్కలు నాటుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇందులో భాగంగానే… గత వారం రోజుల కింద…. ఈ హరిత హారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటేందుకు.. మంత్రి కేటీఆర్‌ మరియు అతని బృందం మహబూబ్‌ నగర్‌ జిల్లాలో పర్యటించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ బృందానికి అక్కడి అధికారులు, టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు గ్రాండ్‌ వెల్‌ కమ్‌ చెప్పారు. అయితే… అంగన్ వాడీ మహిళా ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా.. వారిని చాలా సేపు ఎండలో నిలబెట్టారు.

అయితే… ఈ ఘటనపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్‌ వారం రోజుల కిందట జాతీయ మానవ హక్కుల కమిషనర్‌ లో ఫిర్యాదు చేశారు. అయితే… ఈ ఫిర్యాదుపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ కూడా సీరయస్‌ అయింది. అంతేకాదు.. ఈ ఘటనలో మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్‌ తో మహబూబ్‌ నగర్‌ కలెక్టర్‌లకు హెచ్‌ఆర్సీ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై వివరణ ఇవ్వాలని హెచ్‌ఆర్సీ కీలక ఆదేశాలు జారీ చేసింది.