సోను బాటలో హృతిక్ రోషన్.. ఏం చేసాడంటే..?

-

ప్రస్తుతం కరోనా సంక్షోభం సమయంలో గొప్ప మనసు చాటుకున్న బాలీవుడ్ నటుడు సోనుసూద్ ఎంతోమందికి ఆపద్బాంధవుడిగా మారిపోయిన విషయం తెలిసిందే. వలస కార్మికులకు సహాయం చేయడం నుంచి మొదలు పెట్టిన సోను సూద్ ప్రస్తుతం దేశంలో ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తూ అండగా నిలుస్తున్నారు. ఇక సోనూసూద్ ని ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది ప్రముఖులు కూడా సహాయం కావాలన్న వారికి సహాయం చేస్తూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే.

అయితే ఇటీవలే బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కూడా సోను సూద్ బాటలోనే వెళ్తున్నట్లు తెలుస్తోంది. టాలెంట్ ఉన్న యువతను ప్రోత్సహిస్తున్నారు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్. ఇటీవలే ఇష్నా కుట్టి అనే ఒక యువతి డాన్స్ వీడియో పోస్ట్ చేయగా.. వీడియో పై స్పందించిన హృతిక్ … ఎంతో బాగుంది అంటూ రిప్లై ఇవ్వడం తో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అంతేకాకుండా..లండన్ బ్యాలెట్ స్కూల్లో విరాళాల కోసం డాన్సరైన యువకుడు పెయింటింగ్ వేస్తుండగా యువకుడికి హృతిక్ అండగా నిలిచి కొంత ఆర్థిక సహాయాన్ని అందించారు. దీంతో హృతిక్ రోషన్ పై ప్రశంసలు కురిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news