మ‌డ‌త‌బెట్టే స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసిన హువావే.. ఫీచ‌ర్లివే..!

-

మొబైల్స్ త‌యారీదారు హువావే.. మేట్ ఎక్స్ఎస్ పేరిట మ‌రో మ‌డ‌త‌బెట్టే స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. మేట్ ఎక్స్ లాగే ఇందులోనూ ఫోల్డ‌బుల్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.6, 6.38 ఇంచుల డిస్‌ప్లేలు రెండింటిని ముందు, వెనుక భాగాల్లో ఏర్పాటు చేశారు. వీటిని అన్‌ఫోల్డ్ చేస్తే 8 ఇంచుల డిస్‌ప్లేగా మారుతాయి. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

HUAWEI Mate Xs foldable smart phone launched

హువావే మేట్ ఎక్స్ఎస్ స్మార్ట్‌ఫోన్‌లో అధునాత‌న కైరిన్ 990 5జీ ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ 10 ఓఎస్ ఆధారంగా ఈ డివైస్ ప‌నిచేస్తుంది. కానీ గూగుల్ ప్లే స్టోర్‌కు బ‌దులుగా ఇందులో హువావే మొబైల్ స‌ర్వీసెస్‌ను అందిస్తున్నారు. ఇక దీనికి సైడ్ మౌంటెడ్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. అందులోనే ప‌వ‌ర్ బ‌ట‌న్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో 4 కెమెరాలు ఉన్నాయి. 40 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరా, 16 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 8 మెగాపిక్సల్ టెలిఫొటో కెమెరా, వీజీఏ డెప్త్ సెన్సార్‌లు అందులో ఉన్నాయి. ఇవే కెమెరాల‌తో సెల్ఫీలు కూడా తీసుకోవ‌చ్చు. ఇక ఈ ఫోన్‌లో ఎన్ఎం కార్డ్ స్లాట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో 4500 ఎంఏహెచ్ బ్యాట‌రీని ఏర్పాటు చేయ‌గా, దీనికి 55 వాట్ల సూప‌ర్ చార్జింగ్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు.

హువావే మేట్ ఎక్స్ఎస్ ఫీచ‌ర్లు…

  • 6.6 ఇంచుల ఓలెడ్ డిస్‌ప్లే, 2480 x 1148 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
  • 6.38 ఇంచుల ఓలెడ్ డిస్‌ప్లే, 2480 x 892 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజల్యూష‌న్
  • 8 ఇంచుల ఓలెడ్ డిస్‌ప్లే, 2480 x 2200 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
  • హువావే కైరిన్ 990 5జి ప్రాసెస‌ర్‌, 8జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్
  • 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 10, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌
  • 40, 16, 8 మెగాపిక్స‌ల్ కెమెరాలు, సైడ్ మౌంటెడ్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్
  • 5జి, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ
  • యూఎస్‌బీ టైప్ సి, 4500 ఎంఏహెచ్ బ్యాట‌రీ, సూప‌ర్ చార్జ్

హువావే మేట్ ఎక్స్ఎస్ స్మార్ట్‌ఫోన్ కేవ‌లం ఇంట‌ర్‌స్టెల్లార్ బ్లూ క‌ల‌ర్‌లోనే విడుద‌ల కాగా దీని ధ‌ర 2499 యూరోలు (దాదాపుగా రూ.1,95,245)గా ఉంది. మార్చి నెల నుంచి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ ఫోన్‌ను విక్ర‌యించ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news