ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్ విషయంలో క్యాట్ రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. ఆయన్ను రెండు నెలల క్రితం సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆయన అవినీతి చేసారని, ఆయనపై విచారణ జరపాలని, విచారణ పూర్తి అయ్యే వరకు అమరావతి నుంచి వెళ్ళకుండా ఆదేశాలు ఇచ్చింది. దీనిపై అప్పుడు తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రధానంగా రాజకీయంగా ఇది పెద్ద దుమారమే రేపింది.
అధికార పార్టీపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేసారు. అసలు ఆయనను సస్పెండ్ ఎందుకు చేసారని ప్రశ్నించింది. దీనిపై కృష్ణ కిషోర్ క్యాట్ ని ఆశ్రయించారు, ఆయన వాదనలను విన్న క్యాట్… ఆయనను సస్పెండ్ చేయడాన్ని తప్పుబట్టింది. ఇక ఆయన జీతం ఇవ్వకపోవడం పై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది క్యాట్. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని సమాధానం చెప్పాలని క్యాట్ ఆదేశాలు ఇచ్చింది.
ఇక ఇప్పుడు ఆయనపై సస్పెన్షన్ ని ఎత్తివేస్తూ క్యాట్ ఆదేశాలు ఇచ్చింది. ఇక ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్ళడానికి ట్రిబ్యునల్ క్లియర్ చేసింది. వెళ్ళవచ్చు అని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇక ఆయనపై అవినీతి ఆరోపణలను చట్టపరంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకి వెళ్ళవచ్చని సూచించింది. కాగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనకు ఏ పోస్టింగ్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది.