దేశంలో రాజ్యసభ ఎన్నికల సందడి నెలకొంది. ప్రధాన పార్టీలు అన్నీ కూడా రాజ్యసభలో తమ బలం పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఎన్డియే కాంగ్రెస్ సహా బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా ఇప్పుడు పెద్దల సభలో తమ బలం చాటేందుకు గాను సిద్దమవుతున్నాయి. ఆర్ధికంగా బలంగా ఉన్న నేతలకు అవకాశం ఇవ్వాలని ప్రాంతీయ పార్టీల అధినేతలు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా సహా పలు రాష్ట్రాల్లో ఈ సందడి ఎక్కువగా నెలకొంది.
ఇదిలా ఉంటే రాజ్యసభ ఎన్నికల షెడ్యుల్ ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మార్చి 26న రాజ్యసభ ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. మార్చి 6న నోటిఫికేన్ విడుదల కానుంది. మార్చి 13వ తేదీ నామినేషన్ దాఖలుకు చివరి తేదీగా ఎన్నికల సంఘం నిర్ణయించింది. . ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు, తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
తెలంగాణలో కేవీపీ, గరికాపాటి రాంమోహన్ రావు, ఏపీలో కే కేశవరావు, ఏంఏ ఖాన్, టి. సుబ్బిరామిరెడ్డి, తోట సీతరామలక్ష్మీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. 17 రాష్ట్రాల్లో 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి పోలింగ్ జరగనుంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. దీనితో ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు కసరత్తులు చేస్తున్నాయి.