పోలీసు ఉద్యోగాలకు ముగిసిన దరఖాస్తులు.. ఒక్కొ ఉద్యోగానికి ఎన్నంటే..

-

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే పోలీస్‌ ఉద్యోగాలకు కోసం ఇచ్చిన నోటిఫికేషన్‌ దరఖాస్తు గడువు నిన్నటితో ముగిసింది. అయితే పోలీసు ఉద్యోగాలకు అభ్యర్థులు భారీ దరఖాస్తులు చేసుకున్నారు. భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్టు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి (టీఎస్‌ఎల్పీఆర్బీ) వర్గాలు వెల్లడించాయి. పోలీస్‌, ఎక్సైజ్‌, జైళ్లు, రవాణా, అగ్నిమాపక శాఖల్లోని మొత్తం17,516 పోస్టులకు విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేయగా గడువు ముగిసే సమయానికి 12.70 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు తెలిపాయి.

Telangana Police Recruitment 2021: Notification Released for Assistant  Public Prosecutor on tslprb.in; Last date - August 29

అంటే ఒక్కొక్క పోస్టుకు సగటున 72 దరఖాస్తులు వచ్చినట్టయ్యింది. మొత్తం 7.20 లక్షల మంది అభ్యర్థులు ఈ దరఖాస్తులను సమర్పించారు. పలువురు అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేశారు. దరఖాస్తుదారుల్లో 25 శాతం మంది మహిళలు ఉంటారని అంచనా. నోటిఫికేషన్‌ వెలువడిన నాటి నుంచి రోజుకు సగటున 49 వేల మంది చొప్పున దరఖాస్తు చేసుకొన్నట్టు బోర్డు అధికారులు చెప్తున్నారు. ఈ పోస్టుల భర్తీకి తుది గడువు
గురువారం రాత్రి 10 గంటలతో ముగిసింది.

Read more RELATED
Recommended to you

Latest news