మరికొన్ని గంటలే సమయం.. మద్యం షాపుల వద్ద ఎగబడుతున్న మందుబాబులు..!

Join Our COmmunity

జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో ప్రచారం గడువు రేపు సాయంత్రం ఐదు గంటలతో ముగియనుంది అన్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే రేపు సాయంత్రం ఆరు గంటల నుంచి డిసెంబర్ ఒకటో తేదీ సాయంత్రం 6 గంటల వరకు కూడా గ్రేటర్ పరిధిలోని అన్ని మద్యం దుకాణాలను మూసివేసేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ ఎన్నికల సంఘం. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఏ మద్యం షాపు వద్ద చూసిన భారీగా బారులు తీరిన మందుబాబులు కనిపిస్తున్నారు.

ఎందుకంటే రెండు రోజుల పాటు మద్యం షాపులు పూర్తిగా మూతపడనున్న నేపథ్యంలో ప్రస్తుతం ముందే కొంత మద్యాన్ని తీసుకొని పెట్టుకోవాలి అనే ఆలోచనతో ప్రస్తుతం ఎంతోమంది మందుబాబులు మద్యం షాపుల వరకు బారులు తీరుతున్నారు. రేపు సాయంత్రం ఆరు గంటల నుంచి మద్యం షాపులు మూతపడడంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా మద్యం షాపులు బారులు తీరిన మందు బాబులతో దర్శనమిస్తున్నాయి.

TOP STORIES

ఐఓఎస్ ఫేస్‌బుక్ యూజ‌ర్ల‌కు స‌మ‌స్య‌లు.. లాగిన్ అవ‌డంలో ఇబ్బంది..

వాట్సాప్ కార‌ణంగా ప్ర‌స్తుతం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న దాని మాతృసంస్థ ఫేస్‌బుక్‌కు ఇప్పుడు సాంకేతిక స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. ఫేస్‌బుక్‌కు చెందిన ఐఓఎస్ యాప్‌ను వాడుతున్న యూజ‌ర్ల‌కు...
manalokam telugu latest news