కేఎల్ రాహుల్ నన్ను క్షమించు : మాక్స్ వెల్

ఐపీఎల్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున ఆడిన సీనియర్ ఆటగాడు మ్యాక్స్వెల్ కనీస స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు అనే విషయం తెలిసిందే. ఇక ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత జట్టు ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో మాత్రం మాక్స్వెల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ క్రమంలోనే మ్యాక్స్వెల్ పై ఎన్నో మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.

ఇక తాజాగా దీనిపై స్పందించిన మ్యాక్స్వెల్.. టీమిండియా తో ఆడిన తొలి వన్డేలో కేఎల్ రాహుల్ కి తాను క్షమాపణలు చెప్పాను అంటూ చెప్పుకొచ్చాడు. కాగా నిన్న జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో మాక్స్వెల్ అద్భుతంగా రాణించాడు అన్న విషయం తెలిసిందే. కేవలం 19 బంతుల్లోనే 5 ఫోర్లు 3 సిక్సర్లతో మెరుపు బ్యాటింగ్ చేసి 45 పరుగులు చేశాడు.