ఎల్జీ పాలీమర్స్ గ్యాస్ లీక్ ఘటనను విశాఖ ప్రజలు ఇంకా మర్చిపోకముందే.. మరో ఘోర అగ్ని ప్రమాదం విశాఖపట్నంలో చోటుచేసుకుంది. నగరంలోని రాంకీ ఫార్మాసిటీలో సోమవారం (జులై 13) రాత్రి సుమారు 11 గంటల సమయంలో భారీ పేలుడు శబ్దం వినిపించింది. అనంతరం మంటలు ఎగసిపడుతున్నాయి. ఒక్కసారిగా ఎగసిపడుతున్న మంటలను చూసి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
పరిశ్రమ నుంచి 2, 3 కి.మీ. వరకు మంటలు కనిపిస్తున్నాయి. మంటలు ఎగసిపడుతున్న ప్రదేశంలో ఇప్పటికి 17సార్లు పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. పేలుళ్ల కారణంగా ఫైర్ ఇంజిన్ కూడా ఘటనా స్థలికి దూరంగా నిలిచిపోయినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.