తెలంగాణలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది.. దీని దెబ్బకి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాతే దీని ప్రభావం మరీ తీవ్రంగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. దీన్ని కట్టడి చేయలేకపోతున్నారు. కాగా, సోమవారం నాడు రికార్డు స్థాయిలో 1,550 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా హైదరాబాద్‌లోనే 926 మంది కరోనా బారిన పడ్డారు. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 212, కరీంనగర్ జిల్లాలో 86, మేడ్చల్ జిల్లాలో 53, నల్గొండ జిల్లాలో 41, ఖమ్మం జిల్లాలో 38, కామారెడ్డి జిల్లాలో 33, సంగారెడ్డి జిల్లాలో 19, వరంగల్ అర్బన్ జిల్లాలో 16, మహబూబాబాద్ జిల్లాలో 13, మహబూబ్ నగర్ జిల్లాలో 13, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, సూర్యాపేట, జనగాం జిల్లాల్లో 10 కేసులు నమోదయ్యాయి.
ఇవాళ 1,197 మంది డిశ్చార్జి అవగా.. మరో 9 మంది మరణించారు. తాజా లెక్కలతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 36,221కి చేరింది. వీరిలో కరోనా నుంచి కోలుకొని 23,679 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 365 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 12,178 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.